Study Material for APTET and DSC

Study Material for APTET and DSC
Showing posts with label పద్యలక్షణాలు. Show all posts
Showing posts with label పద్యలక్షణాలు. Show all posts

Thursday, 22 March 2012

APTET Telugu Notes (వ్యాకరణం-4)


                      పద్యలక్షణాలు
1.
ఉత్పలమాల:
1.
ఇందులో నాలుగు పాదాలుంటాయి.
2.
ప్రతి పాదంలో , , , , , , అనే గణాలు వరుసగా వస్తాయి.
3.
యతిస్థానం 10 అక్షరం
4.
ప్రాసనియమం ఉంటుంది
5.
ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి
2.
చంపకమాల:
1.
ఇందులో నాలుగు పాదాలుంటాయి.
2.
ప్రతి పాదంలో , , , , , , అనే గణాలు వరుసగా వస్తాయి.


3. యతిస్థానం 11 అక్షరం
4.
ప్రాసనియమం ఉంటుంది
5.
ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి
3.
శార్దూలం:
1.
ఇందులో నాలుగు పాదాలుంటాయి
2.
ప్రతిపాదానికి , , , , , , అనే గణాలు వరుసగా వస్తాయి
3.
యతిస్థానం 13 అక్షరం
4.
ప్రాసనియమం ఉంటుంది
5.
ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి.
4.
మత్తేభం:
1.
ఇందులో నాలుగు పాదాలుంటాయి
2.
ప్రతి పాదానికి , , , , , , అనే గణాలు వరుసగా వస్తాయి.
3.
యతిస్థానం 14 అక్షరం
4.
ప్రాసనియమం ఉంటుంది
5.
ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి
5. తేటగీతి:
1.
ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో 5 గణాలుంటాయి
2.
ప్రతి పాదానికి 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
3. 1, 4
గణాల మొదటి అక్షరాలకి యతి చెల్లుతుంది.
4.
ఇందులో యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు
5.
ప్రాసనియమం లేదు
6.
ఆటవెలది:
1.
ఇందులో నాలుగు పాదాలుంటాయి. ఒక్కో పాదంలో 5 గణాలుంటాయి.
2. 1, 3
పాదాలలో 3 సూర్యగణాలు,
2
ఇంద్రగణాలు వరుసగా వస్తాయి.
3. 2, 4
పాదాలలో 5 సూర్యగణాలు ఉంటాయి.
4. 1, 4
గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది.
5.
ఇందులో యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు.
6.
ప్రాసనియమం లేదు.
అలంకారాన్ని గుర్తించుట
1.
నల్లకల్వల వోలె ఉల్లసిల్లెడు విరుల్
కాసారములలోన గ్రాలు గాత.
: పై పద్యపాదంలో ఉపమానమైన నల్లకలువలకు, ఉపమేయమైన ఇరులకు సామ్యం ఉన్నందున ఇది 'ఉపమాలంకారం'.
2.
వర్షాధారవోలె వచ్చు చీకట్లలో
మట్టిదివ్వె నిలుచుమాటకల్ల.
: పై పద్యంలో ఉపమానమైన వర్షధారకు ఉపమేయమైన చీకట్లకు సామ్యం ఉన్నందున ఇది 'ఉపమాలంకారం'.
3.
మృత్యుభయంకరమైన అలలు
శిశువుకి ఉయ్యాలలూపే తల్లివలె
అర్థంలేని జోల పాటల్ని పాడుతున్నాయి.
: ఉపమానమైన ఉయ్యాలలూపే తల్లికి, ఉపమేయమైన భయంకరమైన అలలకు సామ్యం ఉంది కాబట్టి ఇది 'ఉపమాలంకారం'.
4.
రుద్రమ్మ చండీశ్వరాదేవి జలజలాపారించె
శత్రువుల రక్తమ్ము చెడని సెలయేఱుగా.
: పై పద్యంలో రుద్రమ్మను చండీశ్వరాదేవిగా చెప్పారు.
ఉపమేయం అయిన రుద్రమ్మకు ఉపమానం అయిన చండీశ్వరీదేవికి భేదం లేకుండా చెప్పారు కాబట్టి ఇది 'రూపకాలంకారం.
అలంకార లక్షణం
1.
రూపకం: ఉపమానానికి ఉపమేయానికి భేదంలేనట్లు వర్ణించి చెబితే అది రూపకాలంకారం అవుతుంది.
2.
ఉత్ప్రేక్ష: సమానధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది.
3.
అర్థాంతరన్యాసం: విశేష విషయాన్ని సామాన్య విషయంతో, సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించి చెప్తే అది అర్థాంతరన్యాసా లంకారం అవుతుంది.
4.
ఉపమాలంకారం: ఉపమేయానికి ఉపయమానంతో చక్కని పోలిక వర్ణించిచెబితే అది ఉపమాలంకారం అవుతుంది.
5.
వృత్త్యనుప్రాసం: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు మళ్లీమళ్లీ వచ్చేట్లు చెబితే అది వృత్త్యనుప్రాస అలంకారం అవుతుంది.
6.
ఛేకానుప్రాసం: అర్థభేదం ఉన్న హల్లుల జంట వెంట వెంటనే వస్తే అది ఛేకానుప్రాస అలంకారం అవుతుంది.
7.
లాటానుప్రాసం: అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉండేట్లు ఒకే పదాన్ని రెండుసార్లు ప్రయోగిస్తే అది లాటానుప్రాస అలంకారం అవుతుంది.
8.
యమకం: అచ్చుల్లో, హల్లుల్లో మార్పు లేనట్టి అక్షరాల సమూహం అర్థభేదంతో మళ్లీమళ్లీ ప్రయోగిస్తే యమకాలంకారం అవుతుంది.