విజ్ఞానశాస్త్రం - బోధన లక్ష్యాలు |
వివిధ కమిటీలు రూపొందించిన శాస్త్రబోధన లక్ష్యాలు
I. కొఠారి కమిషన్ (1964-66) సూచించిన శాస్త్రబోధన లక్ష్యాలు:
కొఠారి కమిషన్ లేదా భారత విద్యా కమిషన్ శాస్త్ర బోధనలో ప్రత్యేక కోర్సులను ఏర్పాటు చేయాలని, సాధారణ విద్యలో విజ్ఞానశాస్త్రాన్ని నిర్బంధంగా బోధించాలని సూచించింది.
ప్రాథమిక దశ:
¤ విద్యార్థికి సంబంధించిన సామాజిక, భౌతిక, జీవ సంబంధమైన పరిసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
¤ 1, 2 తరగతులు... పరిశుభ్రత, ఆరోగ్యం, ఆరోగ్యకరమైన అలవాట్లు.
¤ 3, 4 తరగతులు.. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్యం.
¤ 4వ తరగతి - రోమన్ అంకెలు నేర్పడానికి ప్రాధాన్యం.
¤ పరిశీలనాత్మక దృష్టిని పెంపొందించాలి.

ప్రాథమికోన్నత దశ:
¤ విద్యార్థి జ్ఞాన సముపార్జనతోపాటు తార్కికంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడంలో సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాధాన్యం.
¤ విజ్ఞానశాస్త్రాన్ని సామాన్య శాస్త్రంగాకాకుండా భౌతిక, రసాయన, జీవ, ఖగోళ శాస్త్రాలుగా విభజించి బోధించాలి.
ఉన్నత దశ/ సెకండరీ దశ:
¤ శాస్త్రబోధన అత్యున్నత విద్యకు ఆధారంగా మానసిక శిక్షణకు క్రమవిభాగంగా ఉండాలి.
¤ సెకండరీ దశకు కింద ఉన్న తరగతుల్లో శాస్త్రాన్ని విడివిడిగా భౌతిక, రసాయన, జీవ, భౌమ్య శాస్త్రాలుగా నిర్బంధంగా బోధించాలి.
¤ ఉన్నత దశలో శాస్త్రంలోని విభాగాలను ప్రత్యేక కోర్సులుగా విభజించి, బోధించి ప్రత్యేకీకరణకు అవకాశం ఇవ్వాలి.
II. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ (1977) శాస్త్రబోధన లక్ష్యాలు:
¤ శాస్త్రం పాఠ్య ప్రణాళికకు ప్రాధాన్యం ఇస్తోందని, పట్టణ ప్రాంతవాసులకు తగినట్లుగా ఉండి, శారీరక కృత్యాలకు దూరంగా ఉంది అని పాఠ్య ప్రణాళికను ఈ కమిటీ విమర్శించింది.
¤ పాఠ్య ప్రణాళికలో మహాత్మాగాంధీ రూపొందించిన బేసిక్ విద్య, కొఠారి కమిషన్ సూచించిన పని విద్య అంశాలకు ప్రధాన స్థానం ఇవ్వాలని సూచించింది.
¤ విద్యను అభ్యసించేటప్పుడే ఆర్జన విషయానికి కూడా ప్రాధాన్యం ఇచ్చి అందుకు తగిన అవకాశాలను కల్పించాలి.
¤ దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా సామాజికంగా ప్రయోజనకరమైన ఉత్పాదనను విద్యావ్యవస్థలో చేర్చాలి (ఎస్‌యూపీడబ్ల్యు).
ప్రాథమిక దశ లక్ష్యాలు:¤ విద్యార్థి జ్ఞాన సముపార్జనతోపాటు తార్కికంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడంలో సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాధాన్యం.
¤ విజ్ఞానశాస్త్రాన్ని సామాన్య శాస్త్రంగాకాకుండా భౌతిక, రసాయన, జీవ, ఖగోళ శాస్త్రాలుగా విభజించి బోధించాలి.
ఉన్నత దశ/ సెకండరీ దశ:
¤ శాస్త్రబోధన అత్యున్నత విద్యకు ఆధారంగా మానసిక శిక్షణకు క్రమవిభాగంగా ఉండాలి.
¤ సెకండరీ దశకు కింద ఉన్న తరగతుల్లో శాస్త్రాన్ని విడివిడిగా భౌతిక, రసాయన, జీవ, భౌమ్య శాస్త్రాలుగా నిర్బంధంగా బోధించాలి.
¤ ఉన్నత దశలో శాస్త్రంలోని విభాగాలను ప్రత్యేక కోర్సులుగా విభజించి, బోధించి ప్రత్యేకీకరణకు అవకాశం ఇవ్వాలి.
II. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ (1977) శాస్త్రబోధన లక్ష్యాలు:
¤ శాస్త్రం పాఠ్య ప్రణాళికకు ప్రాధాన్యం ఇస్తోందని, పట్టణ ప్రాంతవాసులకు తగినట్లుగా ఉండి, శారీరక కృత్యాలకు దూరంగా ఉంది అని పాఠ్య ప్రణాళికను ఈ కమిటీ విమర్శించింది.
¤ పాఠ్య ప్రణాళికలో మహాత్మాగాంధీ రూపొందించిన బేసిక్ విద్య, కొఠారి కమిషన్ సూచించిన పని విద్య అంశాలకు ప్రధాన స్థానం ఇవ్వాలని సూచించింది.
¤ విద్యను అభ్యసించేటప్పుడే ఆర్జన విషయానికి కూడా ప్రాధాన్యం ఇచ్చి అందుకు తగిన అవకాశాలను కల్పించాలి.
¤ దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా సామాజికంగా ప్రయోజనకరమైన ఉత్పాదనను విద్యావ్యవస్థలో చేర్చాలి (ఎస్‌యూపీడబ్ల్యు).
1. అక్షరాస్యత, అంకెల పరిజ్ఞానం, హస్తలాఘవ నైపుణ్యం నియమిత అభ్యసనలకు ప్రాధాన్యం ఇవ్వడం.
2. పరిశీలన ద్వారా జ్ఞానం పొందడం.
3. ఆటపాటల ద్వారా శారీరక దారుఢ్యాన్ని పెంచడం, జట్టు భావనను పెంపొందించడం.
4. సామాజికంగా ఉపయోగపడే కృత్యాల ప్రణాళికను రూపొందించడం, అమలుపరచడంలో నైపుణ్యాన్ని ఏర్పరచడం.
5. కుటుంబం, పాఠశాల, సంఘంలో సహకార ప్రవర్తనను అలవరచడం.
6. సృజనాత్మక శక్తిని పెంపొందించడం.
సెకండరీ లక్ష్యాలు:
1. స్వయం అభ్యసనంలో నైపుణ్యాలను ఏర్పరచడం.
2. విశాల దృక్పథం ఉన్న సాధారణ విద్యను అభ్యసింపజేయడం.
3. శారీరక దారుఢ్యాన్ని పెంచడానికి వ్యాయామ విద్య, ఆటలు మొదలైన వాటిలో పాల్గొనేలా ప్రోత్సహించడం.
4. కళాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి రసాత్మక దృష్టిని, రసాత్మక అభినందనను పెంపొందించడం.
5. సామాజిక, ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం. తద్వారా సమానత్వ సూత్రాలను అలవరచడం.
జాతీయ విద్యావిధానం (1986) సూచించిన లక్ష్యాలు: సమస్యా పరిష్కార పద్ధతిని, నిర్ణయాలు చేయడంలో నైపుణ్యాన్ని పెంపొందించేదిగా, శాస్త్రానికి ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమ ఇతర జీవనాంశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేదిగా శాస్త్రవిద్య ఉండాలి అని పేర్కొంది.
ప్రాథమిక దశ లక్ష్యాలు:
1. తన చుట్టూ ఉన్న పరిసరాలను తన జ్ఞానేంద్రియాల ద్వారా విద్యార్థి పరిశోధించేలా చేయడం.
2. పరిశీలన ద్వారా సమాచారాన్ని సేకరించడానికి తోడ్పడటం.
3. పరిసరాలకు సంబంధించిన వివిధ అంశాలపై నిశితమైన ప్రశ్నలు వేసేట్లు చేయడం.
4. కార్యకారణ సంబంధాన్ని తెలుసుకునేలా చేయడం.
5. వివరాలు, సత్యాల ఆధారంతో నిర్ణయాలు తీసుకునేలా చేయడం.
6. శాస్త్ర అభివృద్ధిలో భారత శాస్త్రజ్ఞుల పాత్రను జ్ఞప్తికి తెచ్చుకునేట్లు చేయడం.
7. సంఘంలోని సహజ వనరులును గుర్తించేట్లు చేసి, వాటిని తగిన రీతిలో ఉపయోగించుకునేలా తెలియజెప్పడం.
8. కాలుష్యాన్ని నివారించడంతోపాటు సహజ వనరులను వ్యర్థం కాకుండా చూడాలని ప్రోత్సహించడం.
ప్రాథమికోన్నత దశ లక్ష్యాలు:
1. శాస్త్రపరిజ్ఞాన స్వభావాన్ని అవగాహన చేసుకుని అభినందించడం. శాస్త్రపరిజ్ఞానం- అ) పరిశీలనపై ఆధారపడిఉంటుందని, ఆ) తాత్కాలికమైందని, ఇ) పరిశుద్ధమైందని, ఈ) నకలు తయారుచేయడానికి వీలైందని తెలుపడం.
2. నిత్యజీవితంలో శాస్త్రీయ పద్ధతికి, శాస్త్ర పరిజ్ఞానానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేయడం.
3. ప్రకృతి సిద్ధాంతాలను విద్యార్థికి పరిచయం చేయడం.
4. శాస్త్రీయ పరిభాష (గుర్తులు, సూత్రాలు) అవగాహన అయ్యేలా చేయడం.
5. వివిధ శాస్త్ర విభాగాలకు మధ్య ఉన్న సమన్వయం తెలుపడం.
6. పరిసరాలతో పరస్పర చర్యను తెలుపడం.
7. శాస్త్రీయ వైఖరిని, సహకార భావాన్ని పెంపొందించడం.
8. మాజిక, నైతిక విలువలను పెంపొందించడానికి శాస్త్రాన్ని ఒక సహాయకంగా తెలియజేయడం
ఉన్నతదశ/ సెకండరీ విద్య లక్ష్యాలు:
1. శాస్త్రీయ భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలపై అవగాహన ఏర్పరచడం.
2. పరికరాలను ఉపయోగించడంలో, ప్రసార విధానాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాలను వృద్ధి చేయడం.
3. విశాల దృక్పథాన్ని, జ్ఞానపరమైన నిజాయతీని అలవరుచుకోవడం. ప్రశ్నించడంలో ధైర్యం పెంచుకోవడం, మానవ గౌరవాలను కాపాడటం, నిర్ణయాలు తీసుకోవడం మొదలైన అంశాల్లో శాస్త్రీయ వైఖరినీ, శాస్త్రీయ విధానాన్ని వృద్ధి చేయడం.
4. సామాజిక, నైతిక, సౌందర్య విలువలను ఏర్పరచడం. తద్వారా వ్యక్తిగతంగా, సామాజికంగా స్వచ్ఛమైన నడవడికను రూపొందించడం.
5. శాస్త్రజ్ఞుల కృషిని అభినందించడం. జీవావరణ వ్యవస్థను కాపాడటం. శాస్త్రాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలపై జాగ్రత్త వహించడం.
లక్ష్యాలు, అభ్యసనానుభవాలు: విద్య వ్యాసంగం త్రిముఖమైంది. ఇది మూడు దశల్లో జరుగుతుంది. అవి:
1. బోధన లక్ష్యాలను ఎంపిక చేయడం.
2. అభ్యసనానుభవాలను రూపొందించడం.
3. మూల్యాంకన పద్ధతులను నిర్ణయించడం.
¤ నిర్దిష్టమైన ఉద్దేశాలతో కోరుకున్న ప్రదర్శనాత్మక మార్పుల కోసం రూపొందించిన విద్యార్థి కృత్యాలను అభ్యసనానుభవాలు అంటారు.
¤ అభ్యాసకుడికీ, విషయానికి మధ్య జరిగే పరస్పర చర్యలే 'అభ్యసనానుభవాలు.'
¤ విద్యార్థికి, పరిసరాలకు మధ్య జరిగే ప్రత్యక్ష పరస్పర చర్యలే 'అభ్యసనానుభవాలు.'
¤ అభ్యసనానుభవాలకు రెండు ధ్రువాలుంటాయి.
1. విషయం నుంచి ఉద్భవించి ప్రవర్తన వైపు వృద్ధి చెందేవి.
2. విషయంతో సంబంధం ఉండి ప్రవర్తన నుంచి ఉత్పన్నమైనవి.
¤ అభ్యసనానుభవాలను వృద్ధి చేయడానికి ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ పాల్గొనాలి. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా ఉండాలి.
అభ్యసనానుభవాన్ని వృద్ధి చేసే పద్ధతులు: అభ్యసనానుభవాన్ని రెండు పద్ధతుల్లో వృద్ధి చేయవచ్చు. అవి:
అ) వైషమ్య పద్ధతి: విషయాన్ని అవగాహన చేసుకున్న, అవగాహన చేసుకోని విద్యార్థుల ప్రవర్తనలో తేడాల ఆధారంగా అభ్యసన సన్నివేశాలు కల్పించడం.
ఆ) గుర్తింపు పద్ధతి: ఉపాధ్యాయుడు తననుతాను విద్యార్థి స్థానంలో గుర్తించుకుని అభ్యసన సన్నివేశాలను కల్పించడం.
ఉత్తమ అభ్యసనానుభవ లక్షణాలు:
1. లక్ష్యాల్లో నిర్వహించిన ప్రవర్తనాపరమైన మార్పులకు తగినట్లు ఉండాలి.
2. నిర్దేశించిన విషయ విభాగానికి తగినట్లుగా ఉండాలి.
3. ఆశించిన మార్పును తేగల సామర్థ్యం, స్థోమత ఉండాలి.
4. ఆచరణాత్మకంగా ఉండాలి.
5. వైయక్తిక భేదాలను పరిగణనలోకి తీసుకోవాలి.
6. అందుబాటులో ఉన్న వనరులతో సమకూర్చగలవై ఉండాలి.
7. విద్యార్థులను చైతన్యవంతంగా ఉంచేవిగా ఉండాలి.
8. విద్యార్థులసృజనాత్మకతకు దోహదంచేసేలా ఉండాలి.
9. సమస్య రూపంలో ఉండాలి.
10. వేగంగా మార్పులు తేగలగాలి.
సామర్థ్యాలు - సామర్థ్య ఆధారిత అధ్యయనం:
1. పాఠశాలలోని ప్రతి దశలోనూ కొన్ని సామర్థ్యాలను పెంపొందించాలని 1986 జాతీయ విద్యా విధానం తెలుపుతుంది.
2. బోధనాభ్యసన నిర్వహణ, అధ్యయన సన్నివేశాల రూపకల్పన, మూల్యాంకన సామర్థ్యాల ఆధారంగా జరగడాన్ని సామర్థ్యాధారిత బోధన అంటారు.
3. విద్యా ప్రణాళికలో సూచించిన అభ్యసన సముపార్జనలను అధ్యయనం చేసి, ప్రాథమిక దశలో విద్యార్థులందరూ పొందదగిన సామర్థ్యాలను నిర్ణయించడానికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ యునెస్కో- ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్‌లో పనిచేసిన ప్రొఫెసర్ ఆర్.హెచ్.దవే అధ్యక్షతన కమిటీని నియమించింది.
4. కుల, మత, ప్రాంత, లింగ భేదం లేకుండా పిల్లలందరూ సాధించదగిన స్థాయి విద్యనభ్యసించాలి. ఈ మౌలిక ఉద్దేశంతో కనీస అభ్యసన సాయులను రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.
5. కనీన అభ్యసన స్థాయులు నిర్ధారించడం ద్వారా విద్య నాణ్యత, విద్యార్థుల అవసరాలు, సమానత్వాన్ని పెంపొందించే దృష్టితో ప్రాథమిక విద్యా స్థాయిలో నిర్మాణాత్మకమైన అభ్యసనకు అవకాశం కల్పించారు.
6. కనీస అభ్యసన స్థాయి అంటే ఆశించిన అభ్యసనార్జనులుగా తెలియజేసే అధ్యయన స్థాయిని, గమనించగల అంతిమ వైఖరిగా తెలుపవచ్చు.
7. విద్యా లక్ష్యాలతో అభ్యసనార్జనలను పొందవచ్చు.
8. కనీస అభ్యసన స్థాయి అంటే ప్రతీ విద్యార్థి ఒక తరగతిలో లేదా ఒక విద్యా స్థాయిలో సంపూర్ణంగా సాధించాలని ఆశించిన అభ్యసన సామర్థ్యాలు. కాబట్టి సామర్థ్యాలనే కనీస అభ్యసన స్థాయులుగా పేర్కొనవచ్చు.
9. విద్యా ప్రణాళికా రచనను, తత్సంబంధంగా ఆశించిన అభ్యసన ఫలితాలను, ప్రమాణాలను పరీక్షించడమే విద్యా సామర్థ్యాల లక్ష్యంగా చెప్పవచ్చు.
10. కనీస అభ్యసన స్థాయి లేదా సామర్థ్యాలను స్పష్టీకరించడంలో కింది మౌలిక అంశాలను దృష్టిలోకి తీసు కున్నారు. అవి:
1. తరగతి లేదా స్థాయివారిగా విద్యార్థుల జ్ఞాన సామర్థ్యాలు, వాటికి సంబంధించిన దశలవారీ అభివృద్ధి.
2. పరిసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమ లక్షణాలు.
11. విద్యార్థులు, వివిధ స్థాయుల్లో పొందాల్సిన సామర్థ్యాలను కచ్చితంగా నిర్వచించాలి. ఇది ప్రధానంగా మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
¤ సామర్థ్యాలను నిర్దుష్టంగా నిర్వచించడం వల్ల ఉత్తమ మార్గదర్శకత్వం వహించడానికి, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడానికి వీలవుతుంది.
¤ సామర్థ్యాలను నిర్దేశించడంద్వారా పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడానికి వీలవుతుంది.
¤ ఒక విద్యా సంస్థ హోదాను, ఆ సంస్థ విద్యా విధానాల నాణ్యతను, ఆ సంస్థలోని విద్యార్థుల నిర్వహణ సామర్థ్యాలను బట్టి నిర్వచిస్తారు.

12. కనీసం, స్థాయులు అనేవి అభ్యసనానికి సంబంధించిన గుణాలను తెలుపుతాయి.
13. స్థాయులు అనేవి ప్రమాణాలను సూచిస్తాయి. సామర్థ్య ప్రకటన ప్రతి స్థాయిలో ఉంటుంది.
14. విద్యాప్రణాళిక అనుభవాలద్వారా జరిగేదే అభ్యసనం.
15. కనీసం అనే పదం పరిమాణం ఉన్న సామర్థ్యాల గురించి తెలుపుతుంది.
16. కనీసం అనేది హెచ్చు స్థాయిలోని సామర్థ్యాలను ప్రతిబింబించదు. హెచ్చు స్థాయిలోని సామర్థ్యాలను చేరుకోడానికి ప్రయత్నించే విద్యార్థులకు ఇది ఆటంకం కాదు.
17. కనీస అభ్యసనస్థాయులను సామర్థ్యాలుగా పేర్కొంటారు.
18. సామర్థ్యాలను అభ్యాస లక్ష్యాలని చెప్పవచ్చు.
19. సామర్థ్యాలను ప్రాథమిక స్థాయిలో ప్రతి తరగతికి భాష (తెలుగు, ఇంగ్లిష్), గణితం, పరిసరాల విజ్ఞానాలు I, II లకు రూపొందించారు.
20. ప్రతి సామర్థ్యాన్ని తప్పనిసరిగా పూర్తిగా నేర్చుకోవాల్సి ఉంటుంది.
21. ప్రతిసామర్థ్యాన్నీ ప్రావీణ్యతాస్థాయికి అభివృద్ధి చేయాలి.13. స్థాయులు అనేవి ప్రమాణాలను సూచిస్తాయి. సామర్థ్య ప్రకటన ప్రతి స్థాయిలో ఉంటుంది.
14. విద్యాప్రణాళిక అనుభవాలద్వారా జరిగేదే అభ్యసనం.
15. కనీసం అనే పదం పరిమాణం ఉన్న సామర్థ్యాల గురించి తెలుపుతుంది.
16. కనీసం అనేది హెచ్చు స్థాయిలోని సామర్థ్యాలను ప్రతిబింబించదు. హెచ్చు స్థాయిలోని సామర్థ్యాలను చేరుకోడానికి ప్రయత్నించే విద్యార్థులకు ఇది ఆటంకం కాదు.
17. కనీస అభ్యసనస్థాయులను సామర్థ్యాలుగా పేర్కొంటారు.
18. సామర్థ్యాలను అభ్యాస లక్ష్యాలని చెప్పవచ్చు.
19. సామర్థ్యాలను ప్రాథమిక స్థాయిలో ప్రతి తరగతికి భాష (తెలుగు, ఇంగ్లిష్), గణితం, పరిసరాల విజ్ఞానాలు I, II లకు రూపొందించారు.
20. ప్రతి సామర్థ్యాన్ని తప్పనిసరిగా పూర్తిగా నేర్చుకోవాల్సి ఉంటుంది.
22. అన్ని సామర్థ్యాల్లో లేదా దాదాపు అందరు విద్యార్థులూ ప్రావీణ్యం సాధిస్తే దాన్ని 'అభ్యసన ప్రావీణ్యం' అంటారు.
23. సామర్థ్యాలను ప్రావీణ్యతాస్థాయి వరకు అభివృద్ధి చేయడమే కనీస అభ్యసన స్థాయుల ప్రధాన లక్ష్యం.
24. సామర్థ్యాల సామాన్య లక్షణాలు:
¤ సామర్థ్యాల వర్గీకరణ వాటి పురోగమన అభివృద్ధి,
¤ కార్యదక్షత
¤ తెలియజేయడం,
¤ మూల్యాంకన సామర్థ్యం.
25. కనీస అభ్యసన స్థాయులను కింది ప్రధాన రంగాల ఆధారంగా రూపొందించారు. అవి:
మొదటి రంగం: విద్యార్థి తన పరసరాలు, సమాజం దృష్ట్యా తన సంక్షేమం గురించి జాగరూకత వహించడం.
2-5 రంగాలు: సాంఘిక విషయాలకు సంబంధించిన సామర్థ్యాలు.
6-10 రంగాలు: ఆరోగ్యం, సజీవులు, నిర్జీవులు, భూమి, ఆకాశం లాంటి వాటికి సంబంధించిన సామర్థ్యాలు.
26. ప్రాథమిక దశలో పరిసరాల విజ్ఞాన బోధన అభ్యసనలు విద్యార్థి కేంద్రీకృతంగాను, కృత్యాధారంగాను సామర్థ్యం మీద అధారపడి ఉండాలని జాతీయ విద్యావిధానం - 1986 సూచించింది.
27. సామర్థ్య ఆధారిత అధ్యయనం కోసం సూచించిన కొన్ని పద్ధతులు:
1. సమస్యా పరిష్కార పద్ధతి
2. విజ్ఞానపరమైన అన్వేషణ
3. సృజనాత్మక ఆలోచన
4. నిగమన పద్ధతి
5. హేతువాద విధానం
6. శాస్త్రీయ పద్ధతి మొదలైనవి.
1. సమస్యా పరిష్కార పద్ధతి
2. విజ్ఞానపరమైన అన్వేషణ
3. సృజనాత్మక ఆలోచన
4. నిగమన పద్ధతి
5. హేతువాద విధానం
6. శాస్త్రీయ పద్ధతి మొదలైనవి.
No comments:
Post a Comment