Study Material for APTET and DSC

Study Material for APTET and DSC

Thursday, 22 March 2012

APTET Telugu Notes (సాహిత్య ప్రక్రియలు)

సాహిత్య ప్రక్రియలు
            తెలుగు బోధనాపద్ధతులకు హృదయం లాంటి అధ్యాయం 'సాహిత్య ప్రక్రియలు'. అధ్యాయంలో పద్యం - గద్యం - వ్యాకరణం అనే సాహిత్య ప్రక్రియలతోపాటు, రచనాపద్ధతులుగా చెప్పే వ్యాసరచన - నాటకరచన - కథారచన అనే రచనాపద్ధతులు; ఆధునిక బోధనాపద్ధతులు, బోధనానైపుణ్యాలను ఉపవిభాగాలుగా చదవాల్సి ఉంటుంది.
           '
పద్యబోధన' చదివేటప్పుడు ముందుగా పద్యబోధన లక్ష్యాలు, కవిత్వ నిర్వచనాలను అభ్యసించాల్సి ఉంటుంది.
ఉదా.1: పద్యబోధన లక్ష్యం-
) విషయావగాహన         బి) రసానుభూతి          సి) భాషాజ్ఞానం          డి) మానసికానందం
సమాధానం: బి.
ఉదా.2 : 'రమణీయార్థ ప్రతిపాదక శబ్దాలే కవిత్వం అన్న లాక్షణికుడు'
) ముమ్మటుడు          బి) భామహుడు          సి) విశ్వనాథుడు          డి) జగన్నాథపండిత రాయలు
సమాధానం: డి.
¤  
సాహిత్యజ్ఞానంలో భాగమైన 'పాకములు', 'రసము - స్థాయీ భావములు'; రస స్వరూపం చదవవలసి ఉంటుంది.
ఉదా.1 : సాహిత్య లాక్షణికుల అభిప్రాయం ప్రకారం 'చాలా సులభమైన రచనలు' పాకానికి చెందుతాయి?
) ద్రాక్ష పాకం          బి) కదళీ పాకం          సి) నారికేళ పాకం          డి) కుంభీపాకం
సమాధానం : .
ఉదా.2: బీభత్స రసానికి స్థాయీ భావం
) విస్మయం          బి) జుగుప్స          సి) క్రోధం          డి) భయం
సమాధానం : బి.
¤  
పద్యబోధనలో కీలకమైన అంశాలు - పద్యబోధన పద్ధతులు, పద్యబోధన క్రమం.
ఉదా.1 : పద్యబోధనకు ఉత్తమ పద్ధతి
) ఖండ పద్ధతి           బి) ప్రతిపదార్థ పద్ధతి           సి) తాత్పర్య పద్ధతి           డి) పూర్ణ పద్ధతి
సమాధానం : డి.
ఉదా.2 : పద్య బోధనాక్రమంలో ఉపాధ్యాయుడు దేన్ని తప్పకుండా విద్యార్థుల దృష్టికి తీసుకురావాలి?
) అన్వయ క్రమం           బి) గృహకృత్యం           సి) సంశ్లేషణ           డి) సమాసాలు
సమాధానం : .
¤  
సాహిత్య ప్రక్రియల్లో మరో ముఖ్యమైన ప్రక్రియ గద్యం. ఇందులో గద్య ప్రక్రియ విశిష్ఠత, గద్యబోధన ఉద్దేశాలపై విద్యార్థులు దృష్టి సారించాల్సి ఉంటుంది.
ఉదా.1 : గద్యం కవీనాం నికషం వదన్తి అంటే-
) గద్యం రాయడం కవులకు నిషేధింపబడింది            బి) గద్యం రాసే కవులు అపవాదుకు గురి అవుతారు
సి) గద్యం రాయడం కవులకు పరీక్షలాంటిది                డి) గద్యం రాసే పండితులను కవులంటారు
సమాధానం : సి.
ఉదా.2: గద్యబోధన ఉద్దేశం-
) భాషాజ్ఞానం            బి) ఆనందానుభూతి            సి) హృదయ ద్రవీకరణ            డి) మానసికానందం
సమాధానం: .
¤  
గద్యంలో గద్యపాఠ్య భేదాలతో పాటు చదవాల్సిన మరో ముఖ్యమైన అంశం గద్య బోధన పద్ధతులు
ఉదా: గద్య పాఠ్య భేదాలు-
) 8                         బి) 6                         సి) 11                         డి) 14
సమాధానం : డి.
¤  
ఉపాధ్యాయుడు గద్య బోధనలో అంశాన్ని 'రసభావ' ప్రకటనాత్మకంగా ఆవిష్కరించే పద్ధతి
) వాస్తవిక పద్ధతి             బి) ఉపన్యాస పద్ధతి             సి) సాహిత్య పద్ధతి             డి) నిగమన పద్ధతి
సమాధానం : సి.
¤  
గద్యబోధనలో విద్యార్థులు చివరగా చదవాల్సిన అంశం గద్య బోధనా క్రమం
ఉదా: గద్య పాఠ్యాంశ తరగతి నిర్వహణలో సంధి, సమాస, అర్థసంగ్రహణ సోపానాల తర్వాత నిర్వహింపబడే సోపానం
) ఆదర్శ పఠనం              బి) చర్చ              సి) రచయిత పరిచయం              డి) ఇంటిపని
సమాధానం : బి.
¤  
అధ్యాయంలో గద్య బోధన తర్వాత దృష్టి సారించాల్సిన మరో ఉప విభాగం 'వ్యాకరణ బోధన'.ఇందులో వ్యాకరణం అంటే ఏమిటి?, దాని ఆవశ్యకత, ఉద్దేశ్యాలేమిటి అనే అంశాలను చదవాల్సి ఉంటుంది.
ఉదా : 'ప్రయోగ శరణమ్ వ్యాకరణమ్' అంటే-
) ప్రజల వాడుకలో ఉన్న భాషయే వ్యాకరణ నిర్మాణానికి శరణ్యం
బి) శిష్టులైన వారి వాడుకలో ఉన్న భాషయే వ్యాకర్తకు శరణ్యం
సి) వ్యాకరణ నిర్మాణానికి, ప్రామాణిక కవుల ప్రయోగాలే శరణ్యం
డి) వ్యాకర్తచే ప్రయోగించదగినదని శాసింపబడిన ప్రామాణిక భాషయే శరణ్యం
సమాధానం : .
¤  
వ్యాకరణ బోధనలో అభ్యర్థులు చదవాల్సిన మరో ముఖ్యాంశం - వ్యాకరణంలోని రకాలు
ఉదా: చిన్నయసూరి 'బాలవ్యాకరణం' కోవకు చెందింది?
) తులనాత్మక వ్యాకరణం                              బి) చరిత్రాత్మక వ్యాకరణం              
సి) వర్ణనాత్మక వ్యాకరణం                                డి) విశ్లేషణాత్మక వ్యాకరణం
సమాధానం : సి.
¤  
వ్యాకరణ బోధనలో చివరగా అభ్యర్థులు దృష్టి సారించాల్సిన వాటిలో ముఖ్యమైనవి - దశానుగుణమైన వ్యాకరణ బోధన, బోధనా పద్ధతులు, వ్యాకరణ బోధనాక్రమం.
ఉదా.1: 6 తరగతి వ్యాకరణ నియమాలను రీతిలో బోధించవచ్చు?
) ప్రాయోగిక వ్యాకరణ బోధన                       బి) నైమిత్తిక వ్యాకరణ బోధన
సి) రూపాత్మక వ్యాకరణ బోధన                      డి) నాటకీయ వ్యాకరణ బోధన
సమాధానం : బి.
ఉదా.2: వ్యాకరణ బోధనలో ఉపయోగించే ఉత్తమ బోధన పద్ధతి-
) అనుమానోపపత్తి పద్ధతి                               బి) నిగమోపపత్తి పద్ధతి
సి) సూత్రపద్ధతి                                                డి) సాంప్రదాయిక పద్ధతి
సమాధానం : .

No comments:

Post a Comment