మానవుడి జ్ఞానేంద్రియాలు |
జ్ఞానేంద్రియాల లక్షణాలు:
¤ ప్రతి జ్ఞానేంద్రియం గ్రాహక, సహాయక కణాలతో తయారవుతుంది.
¤ జ్ఞానేంద్రియం దానికి నిర్దేశించిన పనిని మాత్రమే చేస్తుంది.
ఉదా: కన్ను చూడగలదు కానీ, వినలేదు.
¤ జ్ఞానేంద్రియం వార్తలను గ్రహించి, రవాణా చేస్తుంది కానీ వాటిని విభజించి వివరించే శక్తి దానికి లేదు.
¤ ప్రాణంతో ఉండే జీవులు పరిసరాల మార్పులకు జ్ఞానేంద్రియాల సహాయంతో అనుక్రియలు చూపే లక్షణాన్ని 'క్షోభ్యత' అంటారు.
¤ మానవ శరీరంలో 5 ముఖ్యమైన జ్ఞానేంద్రియాలున్నాయి.
అవి: కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం.
¤ చెవిలో అదనంగా 'శరీర సమతాస్థితిని' కాపాడే గ్రాహకాలున్నాయి.
కన్ను: 'సర్వేంద్రియానాం నయనం ప్రధానం'. మానవుడికి కన్ను అతిముఖ్యమైన జ్ఞానేంద్రియం. మానవుడు రెండు కళ్లతో ఒకే వస్తువును చూడగలుగుతాడు. దీన్నే, 'బైనాక్యులర్ విజన్' అంటారు. ఒక వస్తువును మూడుకోణాల్లో చూసి, వస్తువు మనకెంత దూరంలో ఉందో గ్రహించగలుగుతాం. కంటిలో క్లిష్టమైన నిర్మాణం ఉన్న పెద్ద భాగం పుర్రెలోని కనుగుంతలో ఇమిడి ఉంది. కనుబొమ్మలు, కంటి పక్ష్మాలు, కనురెప్పలు సూర్యరశ్మి, దుమ్ము, ధూళి నుంచి కంటిని కాపాడతాయి. కంటిలో అశ్రుగ్రంథులు ఉన్నాయి. ఇవి లవణాలుండే ద్రవాన్ని స్రవిస్తాయి. ఈ ద్రవం కంటికి హాని చేసే క్రిములను సంహరించడానికి, కంటిని తడిగా ఉంచడానికి, దుమ్ము రేణువులను తీసేయడానికి ఉపయోగపడుతుంది. నవ్వడం, ఏడ్వడం లాంటి ఉద్రేక సమయాల్లో ఈ ద్రవం కళ్ల నుంచి ఎక్కువగా బయటకు వస్తుంది. వీటినే 'అశ్రువులు' అంటారు.
కంటి అంతర్నిర్మాణం: కన్ను అంతర్నిర్మాణంలో 3 పొరలు ఉంటాయి. అవి 1. దృఢస్తరం 2. రక్తపటలం 3. నేత్రపటలం(రెటీనా). దృఢస్తరం దృఢంగా తంతురూపంలో ఉంటుంది. రక్తపటలంలో అనేక రక్తనాళాలుంటాయి. ఇవి కంటిలోకి, కంటి నుంచి బయటకు రక్తాన్ని తీసుకుపోతాయి. లోపలి పొర 'నేత్రపటలం', కంటిలో జ్ఞానానికి సంబంధించిన భాగం. ఇది కాంతిని గ్రహంచి కాంతిశక్తిని నాడీ ప్రచోదనాలుగా మారుస్తుంది.
దృఢస్తరం కంటి ముందు భాగంలో శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది. ఇది పారదర్శకంగా ఉండి కాంతి కిరణాలను కంటిలోకి పోనిస్తుంది. శుక్లపటలాన్ని కప్పి కంటి పొర ఉంటుంది. అశ్రుగ్రంథి స్రావం ఈ పొరను తడిగా ఉంచుతుంది.
కనుపాప: శుక్లపటలం కింద గుండ్రగా ఉండే పొరలాంటి నిర్మాణం ఉంటుంది. దీని మధ్యభాగంలో ఉండే రంధ్రాన్ని 'తారక' అంటారు. తారక పని చేసే విధానాన్ని కెమెరాలోని డయాఫ్రమ్‌తో పోల్చవచ్చు. కనుపాప, తారకల పరిమాణాలు లభించే కాంతినిబట్టి నిరంతరం మారుతూ ఉంటాయి. చీకటిలో కనుపాప వ్యాకోచిస్తుంది. తారక పరిమాణం పెరిగి దీని ద్వారా ఎక్కువ కాంతి కంటిలోకి పోతుంది. కాంతి తీక్షణంగా ఉన్నప్పుడు కనుపాప సంకోచం చెందటం వల్ల తారక చిన్నదై, తక్కువ కాంతి లోనికి పోతుంది. కనుపాపలో ఉండే వర్ణక పదార్థం కంటికి నలుపు, బూడిద, పసుపు, నీలం రంగులను కలుగచేస్తుంది.
స్ఫటిక కటకం: ఇది కనుపాప వెనుక ఉండే పారదర్శకమైన కటకం. ఇది కాంతికిరణాలను నేత్ర పటలం పైకి కేంద్రీకరిస్తుంది. శైలికామయ కండరాలు కటకాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. కంటి ముందు భాగంలో ఉండే చిన్నగదిలాంటి నిర్మాణాన్ని 'నేత్రోదక కక్ష్య' అని అంటారు. దీంట్లో ఉండే జెల్లీలాంటి పదార్థాన్ని 'నేత్రోదయం' అంటారు.

కంటిలోపల ఉండే 'కచావత్ కక్ష్య' అనేది ముఖ్యమైన గది. దీంట్లో ఉండే చిక్కటి జెల్లీలాంటి పదార్థాన్ని 'తర్పకం' అంటారు.
నేత్రపటలంలో సుమారు 14 కోట్ల అతిచిన్న కణాలుంటాయి. ఈ కణాలు రెండు రకాలు అవి: 1. దండకణాలు, 2. కోనులు. సామాన్యంగా కోనులకంటే దండకణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. దండాలు, కోనుల నిష్పత్తి 15 : 1 లో ఉంటుంది.
దండాలు: వీటిలో ఉండే ఎర్రని వర్ణక పదార్థాన్ని 'విజువల్ పర్పుల్ లేదా రొడాప్సిన్' అంటారు. వీటికి అతి తక్కువ కాంతిని గ్రహించే శక్తి ఉంటుంది. కానీ వేర్వేరు రంగులను గుర్తించలేవు. అందువల్లే చీకట్లో వస్తువులన్నీ బూడిదరంగులో కనిపిస్తాయి. రొడాప్సిన్ ఏర్పడటానికి విటమిన్ 'ఎ' అవసరమవుతుంది.
కోనులు: వీటిలో ఉండే వర్ణక పదార్థాన్ని 'ఐడాప్సిన్' అంటారు. ఇవి ఎక్కువ కాంతిలో శక్తివంతంగా పనిచేస్తాయి. వీటివల్ల మనం 'నీలం, ఆకుపచ్చ, ఎరుపు' రంగులనేకాకుండా, వీటికి మధ్యస్తంగా ఉండే రంగులను (గౌణ రంగులను) కూడా గుర్తించ గలుగుతున్నాం. తారకకు ఎదురుగా ఉండే నేత్రపటల భాగంలో కోనులు ఎక్కువుగా ఉండే ప్రాంతాన్ని 'ఎల్లోస్పాట్' లేదా 'ఫోలియా' అంటారు. దృక్‌నాడి కంటి నుంచి వార్తలను మెదడుకు చేరవేస్తుంది. 'నేత్రస్తరం/ నేత్రపటలం' దృక్‌నాడితో కలిసే భాగంలో దండాలు, కోనులు ఉండవు. ఈ భాగాన్నే 'అంధచుక్క' అంటారు. ఈ భాగంలో ప్రతిబింబం ఏర్పడదు.

కన్ను పనిచేసే విధానం: ఒక వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలు శుక్లపటలం, తారకల ద్వారా చొచ్చుకుపోయి కటకంపై పడినప్పుడు, ఆ కటకం కిరణాలను నేత్రపటలం మీద కేంద్రీకరిస్తుంది. దానిపై ప్రతిబింబం ఏర్పడుతుంది.
ప్రతిబింబ లక్షణం: నేత్రపటలం మీద ఏర్పడే ప్రతిబింబం, పరిమాణంలో వస్తువు కంటే చిన్నదిగా ఉంటుంది. ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది. రెండు కళ్లలో ఏర్పడే రెండు ప్రతిబింబాలను విశ్లేషించే భాగం మెదడులో ఉంటుంది. అక్కడ ప్రతిబింబం సహజస్థితిలోకి మారుతుంది. అంటే ఈ ప్రతిబింబం వస్తువు యదార్థ పరిమాణం, స్థితికి తీసుకురాబడుతుంది. ఈవిధంగా ఒకవస్తువును మనం మూడుకోణాల్లో చూసి మనకెంత దూరంలో ఉందో తెలుసుకోగలుగుతున్నాం.
దృష్టి లోపాలు: కటకాన్ని నియంత్రించే కండరాలు సరిగా పనిచేయకపోయినప్పుడు వస్తువు దూరానికి తగ్గట్టుగా కటకం మారకపోతే దృష్టి లోపం కలుగుతుంది.
హ్రస్వ దృష్టి (మయోపియా): దీంట్లో ప్రతిబింబం నేత్రపటలానికి ముందు భాగంలో ఏర్పడుతుంది. ఈ లోపం వల్ల దగ్గరి వస్తువులను మాత్రమే చూడగలుగుతారు. ఈ లోపాన్ని పుటాకార కటకాన్ని ఉపయోగించి సరిచేయవచ్చు.
దీర్ఘ దృష్టి (హైపరోపియా): దీంట్లో ప్రతిబింబం నేత్రపటలానికి వెనుకవైపు ఏర్పడుతుంది. అంటే దూరంగా ఉండే వస్తువులే కనిపిస్తాయి. ఈ లోపాన్ని కుంభాకార కటకాన్ని ఉపయోగించి సరిచేయవచ్చు. ప్రతిబింబ లక్షణం: నేత్రపటలం మీద ఏర్పడే ప్రతిబింబం, పరిమాణంలో వస్తువు కంటే చిన్నదిగా ఉంటుంది. ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది. రెండు కళ్లలో ఏర్పడే రెండు ప్రతిబింబాలను విశ్లేషించే భాగం మెదడులో ఉంటుంది. అక్కడ ప్రతిబింబం సహజస్థితిలోకి మారుతుంది. అంటే ఈ ప్రతిబింబం వస్తువు యదార్థ పరిమాణం, స్థితికి తీసుకురాబడుతుంది. ఈవిధంగా ఒకవస్తువును మనం మూడుకోణాల్లో చూసి మనకెంత దూరంలో ఉందో తెలుసుకోగలుగుతున్నాం.
దృష్టి లోపాలు: కటకాన్ని నియంత్రించే కండరాలు సరిగా పనిచేయకపోయినప్పుడు వస్తువు దూరానికి తగ్గట్టుగా కటకం మారకపోతే దృష్టి లోపం కలుగుతుంది.
హ్రస్వ దృష్టి (మయోపియా): దీంట్లో ప్రతిబింబం నేత్రపటలానికి ముందు భాగంలో ఏర్పడుతుంది. ఈ లోపం వల్ల దగ్గరి వస్తువులను మాత్రమే చూడగలుగుతారు. ఈ లోపాన్ని పుటాకార కటకాన్ని ఉపయోగించి సరిచేయవచ్చు.
మనదేశంలోని పిల్లల్లో సాధారణంగా పోషకాహార లోపం వల్ల కంటి ముందుభాగంలో ఉండే పారదర్శకమైన పొర (శుక్లపటలం-కార్నియా) మెత్తబడి పగులుతుంది. దీంతో దృష్టి లోపించడంవల్ల శాశ్వత అంధత్వం వస్తుంది.
మనం తీసుకునే ఆహారంలో విటమిన్-ఎ లోపించడం వల్ల రొడాప్సిన్, ఐడాప్సిన్ ఏర్పడకపోవడంతో దృష్టి లోపాలు వస్తాయి.
కంటిని కెమెరాతో పోల్చినప్పుడు కనుపాప కెమెరాలోని షటర్ (తలుపు)లా, కంటిలోని కటకం - కెమెరాలోని కుంభాకార కటకంలా, రెటీనా - కెమెరాలోని ఫిల్మ్‌లా పనిచేస్తాయి.
కనుగుంతలో ఉండే కనుగుడ్డును కదపడానికి 'ఆరు' కండరాలు పనిచేస్తాయి.
ముక్కు: జ్ఞానాలు రెండు రకాలు. అవి: భౌతిక, రసాయన జ్ఞానాలు. శబ్దం, కాంతి భౌతిక జ్ఞానాలు. వాసన, రుచి రసాయనిక జ్ఞానాలు. రసాయన జ్ఞానాలను గుర్తించే గ్రాహకాలను రసాయన గ్రాహకాలు అంటారు. ఇవి ముక్కు, నాలుకలో ఉంటాయి. ఉన్నత స్థాయి సకశేరుకాల్లో ముఖ్యంగా ఉభయచరజీవుల పైస్థాయి నుంచి వాసన, రుచికి సంబంధించిన గ్రాహకాలను భౌతికంగా వేరు చేశారు. వాసనకు సంబంధించిన ఘ్రాణ గ్రాహకాలు ముక్కులోను, రుచికి సంబంధించిన జిహ్వ గ్రాహకాలు నాలుకపై ఉంటాయి.
ముక్కు నిర్మాణం: ముక్కు (నాసిక)లో పొడవుగా ఉండే కుహరం ఉంటుంది. దీంట్లో పైభాగంలో ఉండే కుహరాన్ని 'నాశికా కుహరం' అని, కింది భాగంలోని కుహరాన్ని 'ఆళిందం' అని పిలుస్తారు. నాసికా కుహరాన్ని ఆవరించి శ్లేష్మ స్తరం ఉంటుంది, దీంట్లో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి. ఈ శ్లేష్మ స్తరంలో శ్లేష్మాన్ని స్రవించే శ్లేష్మకణాలు ఉంటాయి. శ్లేష్మం ఈ స్తరాన్ని తడిగా ఉంచుతుంది. వీటితోపాటు శ్లేష్మస్తరంలో రసాయన గ్రాహకాలు (ఘ్రాణ గ్రాహకాలు) ఉంటాయి. ఇవి వాసనను గ్రహిస్తాయి. ఈ కణాలకు ఉండే శైలికలు నాశికా కుహరంలోకి వ్యాపించి ఉంటాయి.
ముక్కు పనిచేసే విధానం: గాలిలో ఉండే వాసనను కలిగించే రసాయనాలు శ్లేష్మస్తరంలో కరిగినప్పుడు, వాటిని ఘ్రాణ గ్రాహకాలు గుర్తిస్తాయి. గ్రాహకాల ఆధారభాగం నుంచి బయలుదేరే నాడీ పోగులన్నీ కలిసి ఒక పెద్ద ఘ్రాణనాడిగా ఏర్పడతాయి. ఈ నాడి, సమాచారాన్ని విద్యుత్ ప్రచోదనాల రూపంలో మెదడుకు చేరవేస్తుంది. మెదడులోని ఒక ప్రత్యేక భాగం వాసనకు సంబంధించిన సమాచారాన్ని సమీక్షిస్తుంది.
నాలుక: అకశేరుకాలు, చేపల్లో నాలుక లేకపోవటం వల్ల శరీరంపై అనేక ప్రాంతాల్లో జిహ్వగ్రాహకాలు ఉంటాయి. చేపలు తప్ప మిగిలిన సకశేరుకాల్లో జిహ్వగ్రాహకాలు నాలుకపై ఉంటాయి.
|
No comments:
Post a Comment