పాఠ్యప్రణాళిక |
¤ సమాజంలో మార్పుతీసుకురాగల చైతన్యవంతమైన విధానంగా విద్యను పరిగణిస్తున్నారు. విద్యావిధానంలో పాఠ్యప్రణాళికకు చాలా ప్రాముఖ్యం ఉంది.
¤ భావిభారత పౌరులను తీర్చిదిద్దే పాఠ్యప్రణాళిక రేపటి సమాజానికి కావాలి.
¤ విద్యార్థిలో మానసికాభివృద్ధి క్రమానుగతమైంది. కాబట్టి, పాఠ్యప్రణాళిక రచనలో ముందు దశలను ఆధారంగా చేసుకొని భవిష్యత్తు దశలను రూపొందిస్తూ నిరంతర ప్రగతికి దోహదం చేసే విధానాన్ని పాటించాలి.
¤ పాఠ్యప్రణాళికలో శాస్త్రసత్యాలు, భావనలు, సూత్రాలు మొదలైన వాటిని పొందుపరచి, వాటి వినియోగ విలువలకు ప్రాముఖ్యం ఇవ్వాలి.
శాస్త్రీయ విధానాలు, పద్ధతులు పాఠ్యప్రణాళికలో అంతర్లీనంగా ఉండాలి. శాస్త్రపరిజ్ఞానం, శాస్త్రీయవిధానాలు, ఒక వ్యక్తికి నిజజీవితంలోఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి తోడ్పడేలా పాఠ్య ప్రణా ళికను రూపొందించాలి.
పాఠ్యప్రణాళిక అనే తెలుగు పదానికి, కరిక్యులం అనే ఆంగ్ల పదం మూలం. ఇది కరీర్ (carrere) అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. కరీర్ అంటే పందెపు బాట లేదా పరిగెత్తే దారి అని అర్థం.

నిర్వచనాలు:
i. విద్యా పరంగా నిర్వచిస్తే బోధనాభ్యసన కార్య క్రమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గమే పాఠ్యప్రణాళిక.
ii. పాఠశాలలో నిర్ధరించిన లక్ష్యాలను, ఉద్దేశాలను చేరుకునేందుకు ఉపాధ్యాయుడు ఒక కళాకారుడిలా ఉపయోగించే సాధనాన్నే కరిక్యులం అంటారు.
- కన్నింగ్హమ్ (Cunningham)
iii.విద్యార్థులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం కోసం ఉపాధ్యాయుడు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల (కృత్యాల) సమాహారమే పాఠ్యప్రణాళిక.
iv. ఆటస్థలంలో, గ్రంథాలయంలో, తరగతిగదిలో పాఠశాల వెలుపల కూడా విద్యార్థి పొందే ఉద్దేశపూర్వకమైన, యోజనచేసిన అనుభవాల సమ్మేళనమే పాఠ్యప్రణాళిక. - సెకండరీ విద్యాకమిషన్
¤ పాఠ్యప్రణాళిక విషయప్రణాళిక (సిలబస్) + సహపాఠ్య కార్యక్రమాలు+ పాఠ్యేతర కార్యక్రమాలు.
¤ పాఠశాలలో విద్యార్థులు పొందే అనుభవాల సమగ్ర రూపాలే పాఠ్యప్రణాళిక. పాఠశాల జీవితం మొత్తాన్నిపాఠ్యప్రణాళికగా చెప్పవచ్చు.
¤ విద్యాప్రణాళిక పరిధి (పాఠ్యప్రణాళిక పరిధి) విస్తృతమైంది. పాఠశాలకు పాఠ్యప్రణాళికే జీవం.విద్యా ఉద్దేశాలను సాధించడం కోసం విద్యాసంస్థల్లో రూపొందించి అమలు జరిగే కార్యక్రమాల అనుభవాల సమ్మేళనం పాఠ్యప్రణాళిక. ప్రాచీనమైన, సంకుచితమైన భావన ప్రకారం పాఠ్యప్రణాళిక అంటే పఠనం కోసం నిర్దేశించిన నియమిత పాఠ్యాంశాలు.. అంటే సిలబస్.i. విద్యా పరంగా నిర్వచిస్తే బోధనాభ్యసన కార్య క్రమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గమే పాఠ్యప్రణాళిక.
ii. పాఠశాలలో నిర్ధరించిన లక్ష్యాలను, ఉద్దేశాలను చేరుకునేందుకు ఉపాధ్యాయుడు ఒక కళాకారుడిలా ఉపయోగించే సాధనాన్నే కరిక్యులం అంటారు.
- కన్నింగ్హమ్ (Cunningham)
iii.విద్యార్థులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం కోసం ఉపాధ్యాయుడు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల (కృత్యాల) సమాహారమే పాఠ్యప్రణాళిక.
iv. ఆటస్థలంలో, గ్రంథాలయంలో, తరగతిగదిలో పాఠశాల వెలుపల కూడా విద్యార్థి పొందే ఉద్దేశపూర్వకమైన, యోజనచేసిన అనుభవాల సమ్మేళనమే పాఠ్యప్రణాళిక. - సెకండరీ విద్యాకమిషన్
¤ పాఠ్యప్రణాళిక విషయప్రణాళిక (సిలబస్) + సహపాఠ్య కార్యక్రమాలు+ పాఠ్యేతర కార్యక్రమాలు.
¤ పాఠశాలలో విద్యార్థులు పొందే అనుభవాల సమగ్ర రూపాలే పాఠ్యప్రణాళిక. పాఠశాల జీవితం మొత్తాన్నిపాఠ్యప్రణాళికగా చెప్పవచ్చు.
¤ ప్రాచీన దృక్పథంలో విజ్ఞానశాస్త్ర బోధన విషయప్రణాళికలో లక్ష్యాలకు, విషయవ్యవస్థీకరణ విధానానికి, మూల్యాంకనానికి అగ్రస్థానం ఉండేది. కానీ నేడు సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి, పరిశీలనాత్మక దృష్టిని ఏర్పరచడానికి, సమస్య పరిష్కార విధానానికి పాఠ్యప్రణాళికలో అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నారు.
¤ విషయప్రణాళిక (సిలబస్) అనేది ఒక తరగతి ఒక విషయం (Subject)లో బోధించవలసిన అంశాల విస్తృతినీ, పరిమితినీ తెలియజేస్తుంది. ఇది ఆ తరగతి విద్యార్థుల మానసికస్థాయి, విషయజ్ఞానం, దశలపై ఆధారపడి ఉంటుంది. పాఠ్య, విషయ ప్రణాళికలే కాకుండా పద్ధతులు, ఉపకరణాలు, వనరులతో ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది.
¤ 1986 - జాతీయ విద్యా విధానంలో జాతీయ సమగ్ర పాఠ్యప్రణాళికలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడం కోసం శాస్త్రపాఠ్య ప్రణాళికకు సంబంధించి కొన్ని అంశాను చేర్చారు. అవి.. 1. పర్యావరణ పరిరక్షణ 2. పరిమిత కుటుంబ భావన 3. శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం.
పాఠ్యప్రణాళికలోని ప్రధానాంశాలు:
i.నిర్దేశించిన లక్ష్యాలు
ii. అభ్యసనానుభవాలు.ఈ రెండు అంశాల ఆధారంగా పాఠ్యప్రణాళికలో రెండు విభాగాలుంటాయి.
విషయాత్మక భాగం: దీనిలో విషయ పరిజ్ఞానం, అవగాహన ఉంటాయి.
బోధనా విభాగం: ఇందులో లక్ష్యసాధన కోసం వ్యవస్థీకరించిన విషయాలు, బోధనాభ్యసన కృత్యాలు, వనరులు ఉంటాయి. శాస్త్ర అధ్యయనం సందర్భంగా విషయాన్ని ఎంపిక చేయడంలో పాటించవలసిన కొన్ని మౌలిక సూత్రాలు: ప్రాథమిక లేదా మౌలిక పరిజ్ఞానాన్నందించే, బోధనకు అనువుగా ఉండే, సామాజికావసరాలకు సంబంధించిన విషయాలు, నిత్యజీవితానికి సంబంధించిన, విద్యార్థుల ప్రజ్ఞ, ఆసక్తి, అభిరుచులకు తగినట్లుండే విషయ జ్ఞానం.
పాఠ్యప్రణాళిక నిర్మాణ సూత్రాలు:పాఠ్యప్రణాళికలోని ప్రధానాంశాలు:
i.నిర్దేశించిన లక్ష్యాలు
ii. అభ్యసనానుభవాలు.ఈ రెండు అంశాల ఆధారంగా పాఠ్యప్రణాళికలో రెండు విభాగాలుంటాయి.
విషయాత్మక భాగం: దీనిలో విషయ పరిజ్ఞానం, అవగాహన ఉంటాయి.
బోధనా విభాగం: ఇందులో లక్ష్యసాధన కోసం వ్యవస్థీకరించిన విషయాలు, బోధనాభ్యసన కృత్యాలు, వనరులు ఉంటాయి. శాస్త్ర అధ్యయనం సందర్భంగా విషయాన్ని ఎంపిక చేయడంలో పాటించవలసిన కొన్ని మౌలిక సూత్రాలు: ప్రాథమిక లేదా మౌలిక పరిజ్ఞానాన్నందించే, బోధనకు అనువుగా ఉండే, సామాజికావసరాలకు సంబంధించిన విషయాలు, నిత్యజీవితానికి సంబంధించిన, విద్యార్థుల ప్రజ్ఞ, ఆసక్తి, అభిరుచులకు తగినట్లుండే విషయ జ్ఞానం.
శిశు కేంద్రీకృత సూత్రం: పాఠ్యప్రణాళిక విద్యార్థుల వయసుకు తగినట్లు, వారి అవసరాలను తీర్చేట్లు ఉండాలి.
సమైక్యతా సూత్రం: ఆధునిక యుగంలో విద్యార్థి అవ సరాలను, కృత్యాలనూ సమైక్య పరిచే, మూర్తిమత్వాన్ని పెంపొందించే పాఠ్యప్రణాళికను రూపొందించాలి.
సమాజ కేంద్రీకృత సూత్రం: పాఠ్యప్రణాళిక సమాజం ఉద్దేశాలనూ, అవసరాలనూ సంస్కృతినీ ప్రతిబింబించేలా ఉండాలి.
సృజనాత్మక సూత్రం: పాఠ్యప్రణాళిక విద్యార్థిని ఒక పరిశోధకుడి స్థానంలో ఉంచి, సృజనాత్మక కృత్యాలకు అవకాశం కల్పించేదిగా ఉండాలి.
సంరక్షణ సూత్రం: పాఠ్యప్రణాళిక, మన నాగరికతను, సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించడానికి వీలు కల్పించేదిగా ఉండాలి.
కృత్యాధార సూత్రం: 'చేయడం ద్వారా అభ్యసనం' అనే మనో విజ్ఞానశాస్త్ర సూత్రాన్ని సంతృప్తి పరిచేదిగా, 'శాస్త్రమంటే చేయడం' అనే నిర్వచనానికి ప్రాధాన్యం ఇచ్చేదిగా ఉండాలి. వ్యక్తిగత ప్రయోగశాల కృత్యాలకూ, పర్యటనానుభవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ముందుచూపు/ దూరదృష్టి సూత్రం: పాఠ్యప్రణాళిక విద్యార్థిని పూర్తిస్థాయి వ్యక్తిగా రూపొందించేదిగా ఉండాలి.
వైవిధ్య, స్థితిస్థాపక సూత్రం: పాఠ్యప్రణాళిక మారుతున్న సమాజం, విద్యార్థుల అవసరాలకు, వారిలోని వివిధ ఆసక్తులకూ తగినట్లు ఉండాలి. విశాల దృక్పథంతో ఉండాలి. ఏ పరిస్థితిలో అయినా అమలు చేయడానికి అనువైన సర్దు బాటుకు వీలుండాలి.
సంపూర్ణ అభ్యసనానుభవ సూత్రం: శాస్త్ర లక్ష్యాలు ఉద్దేశాలన్నిట్లో అభ్యసనానుభవాలను ఏర్పరుస్తూ నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా పాఠ్యప్రణాళిక ఉండాలి. శాస్త్రాన్ని భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లా చూడకుండా విజ్ఞానాన్నంతా శాస్త్ర ఫలితంగా చూడగలిగేలా ఉండాలి.
విరామ సమయ వినియోగ సూత్రం: పాఠ్యప్రణాళిక విద్యార్థుల విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగిన అలవాట్లు పెంపొందించేలా ఉండాలి.

పాఠ్యప్రణాళిక గురించి సెకండరీ విద్యాకమిషన్ అభిప్రాయాలు:
1. అనుభవాల సమగ్రరూపం
2. భిన్నత్వం, మార్పులకనుగుణం
3. సామాజిక జీవనంతో సంబంధం
4. విరామ సమయ వినియోగానికి శిక్షణ
5. సమైక్యత, సహ సంబంధం.
పాఠ్యప్రణాళిక అభివృద్ధికి కొఠారి కమిషన్ చేసిన సూచనలు: పరిశోధనల ఆధారంగా పాఠ్యప్రణాళికలో తరచూ మార్పు లుండాలి. పాఠశాలలో విద్యాప్రణాళిక విస్తృత పరిధితో ఉండాలి. పాఠ్యపుస్తకాలు, బోధనాభ్యసన సామాగ్రిని హెచ్చు స్థాయిలో రూపొందించాలి. పాఠ్య ప్రణాళికలో మార్పులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలి.కొత్త పాఠ్యప్రణాళికను విద్యార్థుల అవసరాలకు తగినట్లు రూపొందించడానికి ప్రయత్నించడంలో పాఠశాలలకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలుండాలి. వివిధ విద్యా విభాగాలు, శాఖలు జరిపిన పరిశోధన ఫలితాల ఆధారంగా పాఠశాల పాఠ్యప్రణాళికను రూపొందించాలి.

పాఠ్యప్రణాళికను ప్రభావితం చేసే అంశాలు:
1. ఉపాధ్యాయుడు
2. పాఠ్యపుస్తకాలు
3. పరికరాలు, ఉపకరణాలు
4. మార్గదర్శకత్వం
5. పరిపాలన - పర్యవేక్షణ
6. పరీక్షలు, మూల్యాంకనం
యునెస్కో ప్రణాళిక సంఘం ప్రకారం, పాఠ్యవిషయాన్ని బోధనా పద్ధ తులను ప్రభావితం చేసే అంశాలు:
1. సామాజికావసరాలు
2. శాస్త్రీయ జ్ఞానం స్థాయి
3. శాస్త్రాన్ని పఠిస్తున్న విద్యార్థుల వికాసంలో ప్రత్యేకతలు
పాఠ్య ప్రణాళిక నిర్మాణ సిద్ధాంతాలు / వ్యవస్థీకరణ విధానాలు: పాఠ్య ప్రణాళిక కోసం విషయాన్ని కింద పేర్కొన్న పద్ధతుల్లో అమర్చవచ్చు. 1. ఉపాధ్యాయుడు
2. పాఠ్యపుస్తకాలు
3. పరికరాలు, ఉపకరణాలు
4. మార్గదర్శకత్వం
5. పరిపాలన - పర్యవేక్షణ
6. పరీక్షలు, మూల్యాంకనం
యునెస్కో ప్రణాళిక సంఘం ప్రకారం, పాఠ్యవిషయాన్ని బోధనా పద్ధ తులను ప్రభావితం చేసే అంశాలు:
1. సామాజికావసరాలు
2. శాస్త్రీయ జ్ఞానం స్థాయి
3. శాస్త్రాన్ని పఠిస్తున్న విద్యార్థుల వికాసంలో ప్రత్యేకతలు
1. అన్వేషణాక్రమం లేదా చారిత్రక క్రమం.
2. తార్కిక క్రమం ఉదా: ప్రత్యేక విశిష్ట శాస్త్ర విభాగ పద్ధతిలో.
3. ప్రధాన కేంద్రీకృత సిద్ధాంతానికి సంబంధించిన అంశాలను సమూహలుగా ఏర్పర్చడం ద్వారా.
4. విద్యార్థికి తక్షణ ఆవశ్యకత గల సూత్రాలను తెలిపే పద్ధతిలో.
5. విద్యార్థి మానసిక ఉద్వేగాలను, వారి వయసును దృష్టిలో ఉంచుకోవడం ద్వారా.
6. ప్రవర్తనాత్మక మార్పులను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా.
7. యూనిట్ పథకాన్ని రూపొందించడం ద్వారా.
8. పాఠశాలలోఉన్నబోధనావసతి సౌకర్యాలకు తగినట్లుగా.
9. పాఠశాలలో లభించే ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను, వారు బోధనాంశాలకిచ్చే ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడం ద్వారా.
10. రుతుక్రమ విధానం లేదా కాలక్రమ విధానంలో ఏర్పరచడం.
1. చారిత్రక క్రమం:
ఎ). విజ్ఞాన శాస్త్ర విషయాలను చరిత్రను అనుసరించే క్రమంలో (కనుక్కున్న క్రమంలో) అమర్చడం.
బి). కౌమారదశకు పూర్వదశలో ఉన్న విద్యార్థులు చారిత్రక క్రమాన్ని అభినందిస్తారు. ఉదాహరణకు..
సి). సూక్ష్మజీవులకు సంబంధించిన పాఠాలను లివెన్హుక్, లూయిపాశ్చర్ వంటి శాస్త్రవేత్తలతో ముడిపెట్టి బోధించవచ్చు.
డి). తులాదండాలు అధ్యయనాన్ని లోలక భావనలకు ముందుగా చేర్చాలి.
ఇ). ఖగోళశాస్త్రం భూగోళ శాస్త్రానికి ముందుగా ఉండాలి.
ఎఫ్). కర్బన రసాయన శాస్త్రానికి ముందు మూలక రసాయన శాస్త్రాన్ని అమర్చాలి.
జి). విషయాలను చారిత్రక క్రమంలో అమర్చితే, తార్కిక క్రమంలో ఉపయోగకరంగా ఉండవు.
హెచ్). ఈ పద్ధతిలో అమర్చేటప్పుడు ఉపయోగంలేని విషయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తుంది.
2. తార్కిక క్రమం:
ఎ). సాధారణీకరణం లేదా సూక్ష్మీకరణం చేసిన దశను ఆ పాఠ్యవిషయ అభ్యసనానికి ప్రారంభదశగా పరిగణించే క్రమం తార్కిక క్రమం.
బి). ఒక శాస్త్ర భావనను లేదా శాస్త్ర సూత్రాన్ని తీసుకుని దాని వినియోగాన్ని వివిధ రీతుల్లో అధ్యయనం చేయడం.
ఉదా:
1. రసాయన శాస్త్రంలో మూలపదార్థాలు మూలకాలు, సంయోగపదార్థాలు, సంక్లిష్ట సంయోగ పదార్థాలు, మిశ్రమాలు అనే క్రమంలో అమర్చడం.
2. మరో తార్కిక క్రమంలో మూల పదార్థాలను అణు భారం అభివృద్ధి క్రమంలో (పెరిగే క్రమంలో) అమర్చవచ్చు.
3. అలాగే జీవశాస్త్రంలో జీవులను శరీర నిర్మాణరీతుల ఆధారంగా జంతు రాజ్యాన్ని రాజ్యం, ఉపరాజ్యం, వర్గం, ఉపవర్గం, తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతిగా విభజించవచ్చు. లేదా శరీర అవయవాల కార్యకలాపాన్ని ఆధారంగా చేసుకొని, అధ్యయనం చేయవచ్చు.
4. విద్యార్థుల స్వభావానికి కూడా తార్కిక క్రమంతోపాటు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ పద్ధతిలో పాఠ్యప్రణాళికను నిర్మించినా తార్కికంగా సంబంధం ఉండేలా చూడాలి.
3. శీర్షికా విధానం లేదా అంశ పద్ధతి:
ఎ). శాస్త్ర విషయాన్ని శీర్షికల ఆధారంగా విభజించి, అధ్యయనం చేయడాన్ని శీర్షికా విధానం అంటారు.
బి). సైకిల్ చక్రంలో కమ్ముల (spokes)ను కేంద్రస్థానం (hub) నుంచి అంచులకు విస్తరించేలా అమర్చే విధానం వంటిది. సి). శాస్త్రసంబంధమైన సూత్రాన్నిగానీ, ఆసక్తి ఉన్న అంశాన్నిగానీ, సిద్ధాంతాన్నిగానీ ఆధారంగా చేసుకొని అనేక సంబంధిత విషయాల శీర్షికను కేంద్రీకరించి పాఠ్య ప్రణాళికను తయారుచేయడం శీర్షిక పద్ధతి.
ఉదా: 'పని' అనే అంశం ఆధారంగా భౌతికశాస్త్రంలో యాంత్రిక శాస్త్ర పాఠ్య విషయాలన్నిటినీ అధ్యయనం చేయవచ్చు. అలాగే 'శక్తి' అనే అంశంలో వివిధ రకాల, రూపాలశక్తి రసాయనశక్తి, వృక్ష జంతువుల జీవన క్రియలు, పదార్థశక్తి విలువలు, శరీర ఉష్ణోగ్రత క్రమపరచడంమొదలైన విషయాలను జతపరచవచ్చు.
డి). దీనివల్ల విద్యార్థి వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందగలడు.
ఇ). శీర్షిక విధానంలోపాఠ్య ప్రణాళికను అమర్చేటప్పుడు విద్యార్థిలో అభిలషించదగిన వైఖరులు, నైపుణ్యాలు, అభివృద్ధి చెందుతున్నదీ లేనిదీ గమనించాలి. విద్యార్థుల అభిరుచులను, పరిసరాలను దృష్టిలో ఉంచుకొని శీర్షికలు అమర్చాలి.
4. మనోవైజ్ఞానిక విధానం:
ఎ). విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులు, వైఖరులు, సమస్యలు, సహజ సామార్థ్యాల ఆధారంగా పాఠ్య ప్రణాళికను పొందు పరచడం.
బి). విద్యార్థుల్లో వైయక్తిక బేధాలుంటాయి. కాబట్టి, పాఠ్య ప్రణాళికలో కూడా వైవిధ్యం ఉండాలి.
సి). పాఠ్యప్రణాళిక ఒకే విధంగా ఉండాలనే వాదన సరికాదని అన్నది రైబర్న్.
డి). 'ఒకే విధమైన పాఠ్యప్రణాళిక వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత అభివృద్ధి చెందదు' అని పేర్కొన్నది- సెకండరి విద్యా కమిషన్
ఇ). ''పాఠ్య ప్రణాళికలో వైవిధ్యానికీ, సడలింపులకు ఆస్కారం ఉండాలి''- సెకండరీ విద్యాకమిషన్ ఎఫ్)పాఠ్య విషయాలను పరిచితం నుంచి అపరిచితానికి, మూర్తత్వం నుంచి అమూర్తత్వం వైపు, సరళం నుంచి సంక్లిష్టంకు అమర్చాలి.
జి). శీర్షికలను పొందుపరిచేటప్పుడు అభ్యసనానుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి.
హెచ్). ప్రయోగాలు చేయడానికి, ప్రకల్పనలు నిర్వహించడానికీ, క్షేత్ర పర్యటనలు చేయడానికి పరిశోధనలు చేయడానికి వీలుండాలి.
5. ఏకకేంద్రీకరణ పద్ధతి (ఏక కేంద్ర పద్ధతి:)ఎ). విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులు, వైఖరులు, సమస్యలు, సహజ సామార్థ్యాల ఆధారంగా పాఠ్య ప్రణాళికను పొందు పరచడం.
బి). విద్యార్థుల్లో వైయక్తిక బేధాలుంటాయి. కాబట్టి, పాఠ్య ప్రణాళికలో కూడా వైవిధ్యం ఉండాలి.
సి). పాఠ్యప్రణాళిక ఒకే విధంగా ఉండాలనే వాదన సరికాదని అన్నది రైబర్న్.
డి). 'ఒకే విధమైన పాఠ్యప్రణాళిక వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత అభివృద్ధి చెందదు' అని పేర్కొన్నది- సెకండరి విద్యా కమిషన్
ఇ). ''పాఠ్య ప్రణాళికలో వైవిధ్యానికీ, సడలింపులకు ఆస్కారం ఉండాలి''- సెకండరీ విద్యాకమిషన్ ఎఫ్)పాఠ్య విషయాలను పరిచితం నుంచి అపరిచితానికి, మూర్తత్వం నుంచి అమూర్తత్వం వైపు, సరళం నుంచి సంక్లిష్టంకు అమర్చాలి.
జి). శీర్షికలను పొందుపరిచేటప్పుడు అభ్యసనానుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి.
హెచ్). ప్రయోగాలు చేయడానికి, ప్రకల్పనలు నిర్వహించడానికీ, క్షేత్ర పర్యటనలు చేయడానికి పరిశోధనలు చేయడానికి వీలుండాలి.
ఎ). వివిధ రకాలైన శీర్షికలను అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చెందించే పద్ధతి ఏక కేంద్రీకరణ పద్ధతి.
బి). తరగతి స్థాయి పెరిగేకొద్దీ విషయ పరిజ్ఞానం విస్తరిస్తూ ఉంటుంది.
సి). సరళమైన విషయం ప్రాథమిక స్థాయిలోనూ అదే అంశానికి చెందిన విషయాన్ని విపులంగా, క్లిష్టంగా పై తరగతుల్లోనూ ప్రవేశపెడతారు.
డి). విద్యార్థి పరిపక్వత పెరిగేకొద్దీ విషయ పరిజ్ఞానం, వివరణ, క్లిష్టత పెరుగుతూ ఉంటాయి.
ఇ). ఉదాహరణకు ప్రాథమిక స్థాయిలో జ్ఞానేంద్రియాల గురించి సరళంగా, సూక్ష్మంగా అద్యయనం చేస్తారు. ఉన్నత తరగతుల్లో వాటి గురించి విపులంగా తెలుసుకుంటారు.
ఎఫ్). ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞాన శాస్త్రంలో అనుసరిస్తున్న పాఠ్యప్రణాళిక పద్ధతి - ఏకకేంద్రీకరణ పద్ధతి.
6. యూనిట్ పద్ధతి:
ఎ) ఒక సంవత్సరంలో విద్యార్థులకు బోధించవలసిన విషయానికి సంబంధం ఉన్న అర్ధవంతమైన అనేక విభాగాలుగా పాఠ్యప్రణాళికను అమర్చుతారు. ఈ విభాగాలనే యూనిట్లు అంటారు.
బి) యూనిట్ పరిధిని బట్టి చిన్న, చిన్న సబ్ యూనిట్లుగా విభజిస్తారు.
7. రుతుక్రమ పద్ధతి:
ఎ) భోధనాభ్యసన సామగ్రి లభించే కాలాన్నిబట్టి పాఠ్యవిషయాలను అమర్చడం.
బి) ఉదాహరణ: కప్ప సంబంధిత విషయాన్ని వర్షాకాలంలో, మల్లెపూల సంబంధిత విషయాన్ని వేసవికాలంలో వచ్చేలా అమర్చడం.
No comments:
Post a Comment