సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు |
తెలుగు భాషకి ఎంతో సంపద ఉంది. సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు భాషకి సహజ సంపదలు. వీటిని ప్రజలే సృష్టించుకున్నారు. ఇవి మనిషితోపాటే పుట్టి ఉండవచ్చు. మనిషి జీవితానికీ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని వివరిస్తూ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తాయి. ఇవి భాషకి జీవనాడుల లాంటివి. సర్వజనావళికి ఇష్టమైనవి.
సామెతలు
'సామ్యత' నుంచి సామెత పదం వచ్చిందంటారు. సామ్యత అంటే పోలిక. ఒకానొక సందర్భంలో పోలికను తెస్తూ ప్రయోగించేది సామెత. కొందరు సామెతను శాస్త్రంగా పేర్కొంటారు. ''గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వర్తమానాన్ని ఆలోచిస్తూ భవిష్యత్తుకి వర్తించేది సామెత'' అన్నారు ఆరుద్ర. సామెతలు మానవ నైజాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రవర్తనా నియమావళిని వెల్లడిస్తాయి. సామెతలు వాక్యరూపంలో ఉంటాయి. యతి, ప్రాసలక్షణాలూ ఉంటాయి.
ఉదా: అన్నం పెట్టినవారింటికే కన్నం వేయడం
అడగందే అమ్మయినా పెట్టదు
పేదవాడి కోపం పెదవికి చేటు
అడుసు తొక్కనేల? కాలు కడగనేల?
సామెతలు
'సామ్యత' నుంచి సామెత పదం వచ్చిందంటారు. సామ్యత అంటే పోలిక. ఒకానొక సందర్భంలో పోలికను తెస్తూ ప్రయోగించేది సామెత. కొందరు సామెతను శాస్త్రంగా పేర్కొంటారు. ''గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వర్తమానాన్ని ఆలోచిస్తూ భవిష్యత్తుకి వర్తించేది సామెత'' అన్నారు ఆరుద్ర. సామెతలు మానవ నైజాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రవర్తనా నియమావళిని వెల్లడిస్తాయి. సామెతలు వాక్యరూపంలో ఉంటాయి. యతి, ప్రాసలక్షణాలూ ఉంటాయి.
ఉదా: అన్నం పెట్టినవారింటికే కన్నం వేయడం
అడగందే అమ్మయినా పెట్టదు
పేదవాడి కోపం పెదవికి చేటు
అడుసు తొక్కనేల? కాలు కడగనేల?
విధి, తలరాత లాంటి భావాన్ని చెప్పడానికి ''చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ'' అంటారు. ఎవరి స్వభావం వాళ్లదే, మారడం కష్టం అనే అర్థంలో ''ఉల్లిమల్లి కాదు, కాకి కోకిల కాదు'' అని వాడతారు. ''కలుపు తీయని మడి - దేవుడులేని గుడి'' అనడంలో వ్యవసాయంలో కలుపు తీయడం ఎంత ముఖ్యమో తెలియజేయడం కనిపిస్తుంది. ''పూజకొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు'' అనేది సంప్రదాయబద్ధమైన నమ్మకాన్ని తెలియజేస్తే, దీనికి వ్యతిరేకంగా, హేతువాద దృక్పథంతో ''తాయెత్తుకే పిల్లలు పుడితే నేనెందుకు అన్నాడట!'', ''మంత్రాలకు చింతకాయలు రాలతాయా'' లాంటి సామెతలూ ఉన్నాయి. మానవులు హాస్యచతురులు. అందుకే ''తాతా పెళ్లాడతావా అంటే, నాకెవరిస్తారు రా అబ్బీ'', ''గాడిద కొడకా, అంటే తమరు తండ్రులు మేం బిడ్డలం అన్నాడట'' లాంటి హాస్యపు సామెతలూ ఉన్నాయి.
మానవ ప్రవర్తనను పరిశీలిస్తూ, నీతిని బోధించే సామెతల్లో ''చేసిన పాపం చెబితే పోతుంది'', ''గొర్రె కసాయివాణ్ణే నమ్ముతుంది లాంటివి ఉన్నాయి''. ''చదువుకున్నోడి కంటే చాకలి మేలు'', ''దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యడు'', ''రెడ్డి వచ్చె మొదలాడె'' లాంటివి కులాలకి సంబంధించినవి. ఇదేవిధంగా రామాయణ, భారత, భాగవతాదులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. మరికొన్ని సామెతలు చూడండి.
మానవ ప్రవర్తనను పరిశీలిస్తూ, నీతిని బోధించే సామెతల్లో ''చేసిన పాపం చెబితే పోతుంది'', ''గొర్రె కసాయివాణ్ణే నమ్ముతుంది లాంటివి ఉన్నాయి''. ''చదువుకున్నోడి కంటే చాకలి మేలు'', ''దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యడు'', ''రెడ్డి వచ్చె మొదలాడె'' లాంటివి కులాలకి సంబంధించినవి. ఇదేవిధంగా రామాయణ, భారత, భాగవతాదులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. మరికొన్ని సామెతలు చూడండి.
''నవ్విన నాప చేనే పండుతుంది'' ''అందరూ శ్రీవైష్ణవులే, తట్టలో రొయ్యలు మాయం'' ''అడ్డాలనాడు బిడ్డలు గానీ గడ్డాలనాడు బిడ్డలా?'' ''రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది? అన్నాడట'' ''భారతం బొంకు రామాయణం రంకు'' |
''ఇంటి పేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల కంపు'' ''ఎక్కడైనా బావగానీ వంగతోటలో కాదు'' ''కడుపులో లేనిదే కౌగిలించుకుంటే వస్తుందా'' ''ఊపర్ షేర్వాని, అందర్ పరేషాని'' ''మూరెడింట్లో బారెడు కర్ర, ఎలా కొడతావో కొట్టరా మొగుడా'' |
జాతీయాలు
ఒక జాతికి సంబంధించిన విశిష్టమైన పలుకుబడి జాతీయం. జాతీయాలనే పదబంధాలనీ, పలుకుబడులనీ అంటారు. విడివిడి మాటలు కలిసి విశేషార్థంలో ఏర్పడేది జాతీయం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నార్ల, విద్వాన్ విశ్వం సంపాదకత్వంలో ''పదబంధ పారిజాతం'' ప్రచురించింది. జాతీయంలోని అర్థానికీ, లక్ష్యార్థానికీ పోలిక ఉంది. వ్యాకరణంలోని శబ్దపల్లవాలు ఇలాంటివే, జాతీయాలను లేదా సామెతలను మరో భాషలోకి అనువదించలేం. సమానార్థకమైనవి ఉండొచ్చు. తెలుగులోని ''ఈడూ జోడు'' కి ఆంగ్లంలో ''మేడ్ ఫర్ ఈచ్ అదర్'' అనేది సమానార్థకం. ప్రాచీన కవుల కావ్యాల్లో కూడా జాతీయాలు కనిపిస్తాయి. ఉబుసుపోక, ఎకసెక్కమాడు, కడుపు చల్లగా లాంటివి కవులు ప్రయోగించారు.
ఇంటిపోరు, అత్తగారి సాధింపు, మొగుడు, గుండెల మీద కుంపటి మొదలైనవి కుటుంబ సంబంధమైన జాతీయాలు. మన పై అధికారి కఠినంగా ఉంటే ''వాడు నా మొగుడురా బాబూ'' అంటాం.
పెళ్లీడుకొచ్చినా పెళ్లికాకపోతే అదొక భారంగా భావించి పూర్వం కూతురును ఉద్దేశించి ''గుండెల మీద కుంపటి'' అనేవారు. మన ప్రభుత్వ పథకాలన్నీ ''నత్తనడక''గానే సాగుతాయి కదా! జాతీయాల్లో శరీర అవయవాలను ఉపయోగించి చెప్పేవి చాలా ఉన్నాయి. ఒక జాతికి సంబంధించిన విశిష్టమైన పలుకుబడి జాతీయం. జాతీయాలనే పదబంధాలనీ, పలుకుబడులనీ అంటారు. విడివిడి మాటలు కలిసి విశేషార్థంలో ఏర్పడేది జాతీయం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నార్ల, విద్వాన్ విశ్వం సంపాదకత్వంలో ''పదబంధ పారిజాతం'' ప్రచురించింది. జాతీయంలోని అర్థానికీ, లక్ష్యార్థానికీ పోలిక ఉంది. వ్యాకరణంలోని శబ్దపల్లవాలు ఇలాంటివే, జాతీయాలను లేదా సామెతలను మరో భాషలోకి అనువదించలేం. సమానార్థకమైనవి ఉండొచ్చు. తెలుగులోని ''ఈడూ జోడు'' కి ఆంగ్లంలో ''మేడ్ ఫర్ ఈచ్ అదర్'' అనేది సమానార్థకం. ప్రాచీన కవుల కావ్యాల్లో కూడా జాతీయాలు కనిపిస్తాయి. ఉబుసుపోక, ఎకసెక్కమాడు, కడుపు చల్లగా లాంటివి కవులు ప్రయోగించారు.
ఇంటిపోరు, అత్తగారి సాధింపు, మొగుడు, గుండెల మీద కుంపటి మొదలైనవి కుటుంబ సంబంధమైన జాతీయాలు. మన పై అధికారి కఠినంగా ఉంటే ''వాడు నా మొగుడురా బాబూ'' అంటాం.
ఉదా: తలలో నాలుక - చెవి కోసుకోవడం - కళ్లకద్దుకోవడం - పొట్టకొట్టడం - నోరు పారేసుకోవడం - ఒంటికాలిపై లేవడం, కళ్లల్లో నిప్పులు పోసుకోవడం, నోరెట్టుకుని జీవించడం మొదలైనవి.
సామెతల్లోలాగా జాతీయాల్లో కూడా రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించినవి చాలా ఉన్నాయి.
ఉదా: రామరాజ్యం, లక్ష్మణరేఖ, ఉడతాభక్తి, కబంధహస్తం మొదలైనవి రామాయణానికి సంబంధించినవి. శల్యసారథ్యం, పద్మవ్యూహం, కీచకుడు, గొంతెమ్మకోరిక లాంటివి భారతానికి సంబంధించినవి. సంస్కృత సాహిత్య ప్రభావంతో ఆపాదమస్తకం, కాకతాళీయం, నభూతోనభవిష్యతి, అసిధారావ్రతం లాంటివి ఏర్పడ్డాయి. మన ఆచారాలు, నమ్మకాలకి సంబంధించిన వాటిలో మూగనోము, నీ కడుపున పుడతా, పప్పన్నం పెట్టడం, తిలోదకాలు లాంటివి ఉన్నాయి. నాటక సాహిత్యంలోని నాంది, భరతవాక్యం అనేవి కూడా జాతీయాలయ్యాయి. ''నీ భరతం పడతా'' అనడం తెలిసిందే!
కొన్ని జాతీయాలు ఆలంకారికంగా, కవితాపరంగా ఉంటాయి. గాలిమేడలు, ఇసుకేస్తేరాలనంత, కైంకర్యం, కుంభకోణం మొదలైనవి ఈ కోవకి చెందుతాయి. ఒకే వస్తువుపై అనేక జాతీయాలున్నాయి.
ఉదా: కాకి గోల, కాకి మూక, కాకి బంగారం, కాకి కూడు, కాకి ఎంగిలి తదితరాలు.
మరో విశేషం - ఖరారునామా, ఖరాబు చేయడం, గులాంగిరి, ఖతం లాంటివి ఉర్దూ ప్రభావం వల్ల ఏర్పడ్డాయి. సామెతలకి కథలున్నట్లే జాతీయాలకీ కథలు ఉన్నాయి.
జంటపదాలుగా ఉపయోగించే జాతీయాలూ లేకపోలేదు. అవకతవకలు, కారాలూ మిరియాలూ, రాతకోతలు అనేవి ఇలాంటివే.
మరికొన్ని జాతీయాలు: పుల్లయ్యవేమారం - ఉత్సవ విగ్రహం - కరువులో అధికమాసం - అలకపాన్పు - నిండుకుండ - పానకంలో పుడక - నూతిలో కప్ప - గంగిరెద్దు - అతివృష్టి, అనావృష్టి - మసిపూసి మారేడుకాయ - కళ్లల్లో నిప్పులు పోసుకోవడం - పక్కలో బల్లెం - నామం పెట్టడం - టోపీ వెయ్యడం - తాటాకులు కట్టడం లాంటివి.
పొడుపు కథలు
సామెతలు, జాతీయాల మాదిరే పొడుపు కథలు కూడా ప్రజలు సృష్టించినవే. ''పొడుపు - విడుపు'' ఉన్నవి. అంటే ప్రశ్నిస్తే రహస్యం విప్పేవి. పొడుపు కథలు తార్కికశక్తిని పెంపొందింపజేస్తాయి. మెదడుకు పదును పెడతాయి. చమత్కారంగా, ఆనందకరంగా ఉంటాయి. పొడుపు కథలు చాలావరకు గేయరూపంలో ఉంటాయి. సంస్కృతంలో ''ప్రహేళికలు'' అనేవి ఇలాంటివే. ప్రాసలతో కూడుకుని ''మమ్మల్ని కనుక్కోండి చూద్దాం'' అన్నట్టు ఉంటాయి. పూర్వం పొడుపు కథలతో ఆడుకునేవారు. చిక్కుముడిని విప్పినప్పుడు ఆనందం కలుగుతుంది. పొడుపు కథలు కవితాత్మకంగా ఉంటాయి. కొన్ని ఊహించుకోవాలి. మరికొన్ని ప్రతీకాత్మకంగా ఉంటాయి. ఇంకొన్ని అతిశయోక్తులతో కూడుకుని ఉంటాయి. డా. కసిరెడ్డి వెంకటరెడ్డి పొడుపు కథలపై సిద్ధాంత గ్రంథం రచించారు. జానపద సాహిత్యంలో ఇవీ అంతర్భాగాలే! పొడుపు కథల్ని ఎక్కువగా బాలబాలికలు, యువతీ యువకులు ఉపయోగిస్తారు.
''తోకలేని పిట్ట తొంభై ఆమడలు వెళ్లింది'' అనేది పొడుపు కథ. ఇక్కడ తొంభై ఆమడలు అంటే చాలా దూరం అని అర్థం. దీనికి సమాధానం - ''ఉత్తరం''.
ఉత్తరాన్ని పిట్టతో పోల్చడం - మరి పిట్టకు తోక ఉంటుంది కాబట్టి ''తోకలేని పిట్ట'' అనడం - ఇలా మనిషి తన ఊహాశక్తితో అల్లుకున్నవే పొడుపు కథలు.
''తండ్రి గరగర - తల్లి పీచుపీచు బిడ్డలు రత్నమాణిక్యాలు''
ఆలంకారికంగా అల్లిన పొడుపు కథ ఇది. దీనికి 'పనస పండు అనే సమాధానం తెలియగానే మనసు వికసిస్తుంది. మరో ప్రాంతంలో ''మొక్కజొన్న పొత్తి'' అనే సమాధానం కూడా ఉంది. తల్లిదండ్రులకి బిడ్డలెప్పుడూ రత్నాలూ మాణిక్యాలే. తీపిగురుతులే! కాబట్టి పొడుపు కథల్లో కూడా మానవసంబంధాలు, ఆర్ద్రత లాంటివి గమనిస్తాం.
కొన్ని పొడుపు కథలు:
¤ ''పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది తెచ్చుకోపోతేను గుచ్చుకుంటుంది'' (మొగలిపువ్వు)
¤ ''పుట్టెడు శనగల్లో ఒకటే రాయి'' (చంద్రుడు)
¤ ''కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు'' (కనురెప్పలు)
¤ ''అడవిలో పుట్టింది - అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది - తైతక్కలాడింది'' (కవ్వం)
¤ ''పైనో పలక - కిందో పలక పలకల మధ్య మెలికల పాము పామును పట్టా పగ్గం లేదు పెగ్గెలు పలికే సిగ్గొదినా'' (నాలుక)
No comments:
Post a Comment