మాతృభాషా బోధన - లక్ష్యాలు |
బోధనా లక్ష్యాలను 'టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్'లో మొదటిసారిగా అమెరికన్ విద్యావేత్త బెంజిమన్ బ్లూమ్ విశ్లేషించారు.దీని ఆధారంగా ఎస్.సి.ఇ.ఆర్.టి 1973-74లో 'మ్యాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్‌ను' ప్రచురించింది. దీంట్లో భాషా బోధనకు 10 లక్ష్యాలను గుర్తించారు. ఈ కరదీపికలో ఉద్దేశం, గమ్యం, లక్ష్యం, స్పష్టీకరణం అనే పదాలను నిర్వచించారు.
ఉద్దేశాలు:
పాఠ్య ప్రణాళికల రూపకల్పన, పాఠ్యాంశాల ఎంపిక కోసం ఉపకరించేవి ఉద్దేశాలు. ఇవి దీర్ఘకాలంలో సాధించేవి. వీటిని సామాన్య ఉద్దేశాలు, ప్రత్యేక ఉద్దేశాలు అని రెండు విధాలుగా విభజించారు.
గమ్యాలు:
విద్యా ప్రణాళిక రూపకల్పన కోసం ఉపకరించేవి గమ్యాలు. ఇవి సుదీర్ఘకాలంలో సాధించగలిగేవి. వీటినే ధ్యేయాలని కూడా అంటారు.
లక్ష్యాలు: ఉద్దేశాలు:

ఉద్దేశాలు,గమ్యాల నుంచి ఆవిర్భవించేవే లక్ష్యాలు.ఇవి తరగతి బోధనకు మార్గదర్శకత్వాన్నిస్తాయి. స్వల్పకాలంలో ఒక పాఠ్యాంశం చివర సాధించాల్సినవి లక్ష్యాలు. ఇవి సంవృత లక్ష్యాలు, వివృత లక్ష్యాలు అని రెండు రకాలు.
స్పష్టీకరణలు:
బోధనా లక్ష్యాల సూక్ష్మరూపాలకే స్పష్టీకరణలని పేరు. ఇవి బోధన లక్ష్యాలను ప్రవర్తనా రూపంలో వివరిస్తాయి.ఉపాధ్యాయుడు సమగ్రంగా బోధించడానికి కావాల్సినవి 'లక్ష్యాలు-స్పష్టీకరణలు'
మాతృభాష బోధన జరిపే ఉపాధ్యాయులు - జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్త, రసానుభూతి, భాషాభిరుచి, సముచిత మనో వైఖరి, సృజనాత్మక శక్తి, సంస్కృతీ సంప్రదాయాలు, భాషాంతరీకరణ, నైపుణ్యాలు అనే పది లక్ష్యాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ పది లక్ష్యాలు జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాల్లో అంతర్భాగాలుగా ఉంటాయి.
No comments:
Post a Comment