అభ్యసనానికి తొలిమెట్టు సంసిద్ధత
అభ్యసనం - 2
యత్న దోష పద్ధతి:అభ్యసనం - 2
¤ ఎడ్వర్డ్. లి. థారన్‌డైక్ ఈ సిద్ధాంతాంశాల్ని రూపొందించాడు.
¤ థారన్ డైక్ ప్రయోగాల కోసం వాడిన జంతువు - పిల్లి
¤ ప్రయోగాలకు వాడిన పరికరం - పజిల్ బాక్స్
¤ ఆయన రూపొందించిన ఈ సిద్ధాంతాన్నే సంధాన సిద్ధాంతం అని కూడా అంటారు. అభ్యసనమనేది సంధానాల ద్వారా ఏర్పడుతుందని థారన్ డైక్ వివరించారు. పరిస్థితి, ఉద్దీపన, ప్రతిస్పందన మొదలైన అంశాల మధ్య ఏర్పడే సంధానాలు అభ్యసన హేతువులని ఆయన వర్ణించారు.
¤ థారన్ డైక్ రచన - Animal Intelligence.
¤ ఈ అభ్యసనాన్నే విజయ పథావరణ అభ్యసనం అని కూడా అంటారు.
¤ థారన్‌డైక్‌ను జంతు మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు అంటారు.
ఒక అభ్యసనంలో అనేక యత్నాలు జరుగుతాయి. వాటిలో అన్ని యత్నాలు నేరుగా ఫలితాన్ని అందించవు. అలాంటి వాటినే దోషాలు అంటారు. దోషాల్ని తగ్గించుకొంటూ యత్నించడం వల్ల అభ్యసనం జరుగుతుంది. దోషాలు తగ్గుతున్న కొద్దీ అభ్యసన కాలం తగ్గుతుంది.
¤ థారన్ డైక్ మూడు అభ్యసన నియమాల్ని రూపొందించాడు.
1. సంసిద్ధతా నియమం:
ఇది అభ్యసనానికి తొలిమెట్టు. థారన్ డైక్ అభ్యసన నియమాల్లోకెల్లా అతి ముఖ్యమైంది.
¤ గుర్రాన్ని నీటి తొట్టెవద్దకు తీసుకువెళ్లగలమే కానీ, నీటిని తాగించలేం.
¤ అభ్యసించే అంశాలు విద్యార్థుల అవసరాలతో ముడిపడి ఉండేలా చేస్తే సంసిద్ధత ఏర్పడుతుంది.
¤ Known to unknown కూడా అభ్యసనలో సంసిద్ధతను కలగజేస్తుంది.
¤ సరైన ప్రేరణ కలిగించడం, ఆసక్తి కలిగించే విషయాలు బోధించడం, బహుమతులు మొదలైనవి ప్రకటించడం ద్వారా సంసిద్ధతని ఏర్పరచవచ్చు.
¤ హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో మొదటి సోపానమైన 'సన్నాహం' సంసిద్ధతకు సంబంధించిందే.
¤ Simple to Complex బోధనా విధానం కూడా సంసిద్ధతను పెంపొందిస్తుంది.
¤ పూర్వ జ్ఞానంపై ప్రశ్నలు కూడా సంసిద్ధతకు దోహదపడతాయి.
¤ సంసిద్ధతను అభ్యసనంలో అతిప్రధాన విషయంగా గుర్తించారు.¤ థారన్ డైక్ మూడు అభ్యసన నియమాల్ని రూపొందించాడు.
1. సంసిద్ధతా నియమం:
ఇది అభ్యసనానికి తొలిమెట్టు. థారన్ డైక్ అభ్యసన నియమాల్లోకెల్లా అతి ముఖ్యమైంది.
¤ గుర్రాన్ని నీటి తొట్టెవద్దకు తీసుకువెళ్లగలమే కానీ, నీటిని తాగించలేం.
¤ అభ్యసించే అంశాలు విద్యార్థుల అవసరాలతో ముడిపడి ఉండేలా చేస్తే సంసిద్ధత ఏర్పడుతుంది.
¤ Known to unknown కూడా అభ్యసనలో సంసిద్ధతను కలగజేస్తుంది.
¤ సరైన ప్రేరణ కలిగించడం, ఆసక్తి కలిగించే విషయాలు బోధించడం, బహుమతులు మొదలైనవి ప్రకటించడం ద్వారా సంసిద్ధతని ఏర్పరచవచ్చు.
¤ హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో మొదటి సోపానమైన 'సన్నాహం' సంసిద్ధతకు సంబంధించిందే.
¤ Simple to Complex బోధనా విధానం కూడా సంసిద్ధతను పెంపొందిస్తుంది.
¤ పూర్వ జ్ఞానంపై ప్రశ్నలు కూడా సంసిద్ధతకు దోహదపడతాయి.
2. అభ్యాస నియమం:
¤ ఒక పనిని పదే పదే చేయడం.
¤ అభ్యాసం చేయడం ద్వారా అభ్యసనం పటిష్ఠమవుతుంది. దీన్నే ఉపయోగ నియమం అంటారు.
¤ ఒక విషయాన్ని ఉపయోగించకుంటే నిరుపయోగం అవుతుంది. దీన్నే నిరుపయోగ నియమం అని అంటారు.
¤ తినగ తినగ వేము తియ్యన, అభ్యాసం కూసు విద్య, సాధనమున పనులు సమకూరు ధరలోన, మొదలైన సామెతలు అభ్యాస నియమానికి సంబంధించినవే.
¤ నియోజనాలు, ఇంటిపని రూపంలో అభ్యాసం కనిపిస్తుంది.
¤ శారీరక వ్యాయామ విద్య (Drill) కౌశలాలు, నైపుణ్యాలు మొదలైన అంశాల్లో అభ్యాసం తప్పనిసరి.
¤ గణిత అధ్యయనంలో అభ్యాసం పాత్ర కీలకం.
¤ అభ్యాసం ద్వారా పునస్మరణ జరిగి స్మృతి దృఢంగా ఏర్పడుతుంది.
¤ విద్యా వ్యవస్థలో పునస్మరణ స్మృతి ప్రక్రియ కీలకం కాబట్టి అభ్యాసం అనివార్యం.
¤ నిర్వచనాలు, సంకేతాలు, ఎక్కాలు, పద్యాలు మొదలైనవి నేర్చుకునే ప్రక్రియలో అభ్యాసం కీలక పాత్రధారి.
3. ఫలిత నియమం :
¤ ఫలితం వస్తుందనే భావనే అభ్యసనానికి దారి తీస్తుంది.
¤ ఉద్దీపనకు, ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడితే ఆ సంధానం పటిష్ఠమవుతుంది. అలా కాకుండా అసంతృప్తి పరిస్థితి ఏర్పడితే ఆ సంధానం క్షీణిస్తుంది. తరగతి గది ఫలితాలు సంతృప్తి కలిగిస్తే అభ్యాసి అభ్యసనంలో పురోగమిస్తాడు.
¤ తాము అభ్యసించే అంశం తను నిజజీవితానికి ఉపయోగపడుతుందని సంతృప్తి పడితే అభ్యసనం చురుగ్గా జరుగుతుంది.
¤ బహుమతులు, ప్రశంసలు అభ్యాసిలో ప్రేరణను పెంచుతాయి.
¤ సాధించగలిగే నియోజనాలను ఇచ్చినప్పుడే వాటిని సాధించి (ఫలితం పొంది) మళ్లీ అభ్యసనానికి అంకితం అవుతారు.
అంతర్ దృష్టి అభ్యసనం
¤ దీన్ని గెస్టాల్ట్ వాదం లేదా సాకల్య సిద్ధాంతం (Theory of Totality) అని కూడా అంటారు.
¤ గెస్టాల్ట్ అనే జర్మన్ పదం అర్థం - సమగ్రాకృతి
¤ 1914లో జర్మన్ దేశీయుడైన కోహెలర్ టెనరీఫ్ దీవుల్లో ఏడు చింపాంజీలపై చేసిన ప్రయోగాల ద్వారా ఈ అభ్యసనాంశాల సైద్ధాంతికతను రూపొందించారు.
¤ కోహెలర్ రచన 'ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్'
¤ ఏడు చింపాంజీల్లో సుల్తాన్ అనే చింపాంజీపై చేసిన ప్రయోగాలు ప్రముఖమైనవి.
¤ మెదడు పరిమాణం, నిర్మాణంలో చింపాంజీలకు మానవులకు మధ్య సంబంధం ఉండటం వల్ల చింపాజీలను ఎంపిక చేసుకున్నాడు.
¤ మొత్తం సన్నివేశ అంశాలను గమనించిన చింపాంజీలో తన సమస్య పరిష్కారానికి పరిసరాల అంశాలతో ప్రత్యక్ష పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుంది.
¤ సమస్య పరిష్కారం ఉన్నట్లుండి హఠాత్తుగా ఏర్పడుతుంది.
¤ అంతర్ దృష్టి అభ్యసనంలో కూడా మొత్తం (Totality) అంశాలను పరిశీలించిన తరువాత 'హఠాత్ ఆలోచన' ద్వారా అభ్యసనం జరుగుతుందని విశ్వసిస్తుంది.
¤ కోహెలర్ తన ప్రయోగాలను RM ఎర్క్స్ ప్రయోగాలతో పోల్చుకున్నాడు.
¤ కోహెలర్, కోఫ్కా, మెర్ధిమర్‌లు ఈ వాదానికి చెందిన వారు.
అంతర్ దృష్టిలోని ప్రధానాంశాలు :
¤ సమస్య పరిష్కారానికి అనుకూలం
¤ మొత్తం పరిస్థితుల పరిగణన.
¤ ప్రజ్ఞ, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
¤ ప్రత్యక్ష పునర్‌వ్యవస్థీకరణ, హఠాత్ ఆలోచన.
అనువర్తనం
¤ సృజనాత్మక, వైయుక్తి భేద ఆధారిత విద్యా ప్రక్రియలో అంతర్‌దృష్టి అభ్యసనం ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
¤ ఉపాధ్యాయులు ఒక విషయాన్ని బోధించేటప్పుడు కేవలం ఆ విషయానికి మాత్రమే పరిమితం కాకుండా, సంబంధిత ఇతర విషయాలకు కూడా అనుసంధానం చేసి అర్థసహితంగా బోధించడం ద్వారా అభ్యసనం సులభంగా జరుగుతుంది. దీనికి కారణం అంతర్ దృష్టి అభ్యసనం జరగడమే.
¤ ఒక సబ్జెక్టులోని అంశాలను ఇతర సబ్జెక్టుల్లోని అంశాలకు అనుసంధానం చేయడం.
¤ ఉపాధ్యాయుడు 'వ్యవస్థాపనం' పై ప్రధానంగా దృష్టి సారించి బోధించడం వల్ల బోధనాంశాలు చక్కగా అర్థమవుతాయి.
¤ బోధనాపద్ధతులైన 'సమస్యా పద్ధతి', 'ప్రాజెక్ట్ పద్ధతి', 'అన్వేషణా పద్ధతి'లో అంతర్‌దృష్టి అభ్యసనం కీలక పాత్ర పోషిస్తుంది.
¤ 'ఆహా.. ఈవిధంగా చేయాలా?' 'యురేకా' లాంటి భావాల మిళితం.
పరిశీలనాభ్యసనం:
¤ ఆల్‌బర్ట్ బందూరా 'Social learning, personality development and psychological modelling' లో పరిశీలనాభ్యసనం గురించి పేర్కొన్నారు.
¤ మానవుడి పుట్టుక నుంచి ఈ పద్ధతిలోనే అత్యధిక అంశాల అభ్యసనం ఉంటుంది.
¤ సహజమైన అభ్యసనంగా గుర్తింపు పొందింది.
¤ అనుకరణ, పాత్ర క్రీడల్లో కనిపిస్తుంది.
¤ ఉపాధ్యాయుడిని చాలా మంది విద్యార్థులు పరిశీలించి, కొన్ని విషయాలను తమ ప్రవర్తనలో పొందుపరచుకోవడం.
¤ సరైన నమూనాలు, చిత్రాలు మొదలైన వాటిద్వారా జరిగే అభ్యసనమే పరిశీలనా అభ్యసనం అని బందూరా వర్ణించారు.
¤ శిశువు సాంఘీకరణలో కీలక పాత్రదారి ఈ తరహా అభ్యసనమే.
¤ ఒక విద్యార్థి శివాజీ చరిత్రను చదివిన తరువాత ఆయనలోని దేశభక్తిని అలవరచుకోవడం.
¤ బడితోటలో వివిధ మొక్కలను పరిశీలించి మొక్కల వర్గీకరణ, మొక్క భాగాలను విద్యార్థి నేర్చుకోవడం.
¤ మూడుఅట్టల ప్రయోగం ద్వారా కాంతి రుజుమార్గంలో పయనిస్తుందని గమనించడం.
అభ్యసన వక్రరేఖలు
(ఈ వక్ర రేఖలపై ప్రతి డీఎస్సీలో ఒక ప్రశ్న వస్తుంది)
¤ అభ్యసనం తీరుతెన్నులను వివరించే అభ్యసన వక్ర రేఖలు.
¤ బ్రయాన్, హార్టర్‌లు రూపొందించారు.
¤ ఇవి స్థూలంగా మూడు రకాలు:
1. ఆరోహణ వక్ర రేఖలు
2. అవరోహణ వక్రరేఖలు
3. S ఆకారపు రేఖలు.
1. ఆరోహణ వక్రరేఖ (పుటాకార వక్రరేఖ లేదా పురోగమన వక్రరేఖ) ఆరోహణ వక్రరేఖలో కాలం గడిచేకొద్దీ దక్షత పెరుగుతుంది. తొలిదశలో అభ్యసనం నిదానంగా ఉంటుంది. కాలం గడిచేకొద్దీ వేగాన్ని అందుకొని క్రమంగా పెరుగుతుంది. ¤ ఈ తరహా అభ్యసన ప్రక్రియను ఆరోగ్యకరమైందిగా గుర్తిస్తారు. | |
¤ 'బట్టీ' తక్కువగా ఉంటుంది. పూర్తిస్థాయి అవగాహనతో జరిగే అభ్యసనంలో ఈ తరహా వక్రరేఖ కనిపిస్తుంది.
¤ ప్రాథమిక తరగతులకు అంత అనుకూలం కాకపోయినా ఉన్నత తరగతుల్లో ఈ తరహా అభ్యసనం కీలకపాత్ర పోషిస్తుంది.
¤ ప్రాథమిక తరగతులకు అంత అనుకూలం కాకపోయినా ఉన్నత తరగతుల్లో ఈ తరహా అభ్యసనం కీలకపాత్ర పోషిస్తుంది.
2. అవరోహణ వక్రరేఖ (కుంభాకార వక్రరేఖ లేదా తిరోగమన వక్రరేఖ): ఆరోహణ వక్రరేఖ సూచించే అభ్యసనంలో అభ్యసన తొలికాలంలో దక్షత లేదా అభ్యసించే అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తొలి ప్రేరణ ఇతర కారణాలు కావచ్చు. తొలిదశలో చాలా వేగంగా ఉండే అభ్యసనం కాలక్రమేణా తగ్గుతూఉంటుంది. దక్షత కూడా తగ్గుతుంది. | |
¤ అంశాలు తక్కువగా ఉంటే, ఈ తరహా అభ్యసనానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3. S వక్రం (మిశ్రమ వక్రం): ¤ ఆరోహణ, అవరోహణాల మిశ్రమం. అభ్యసన ప్రక్రియలో తీవ్రఅవాంతరాలు, ఒడిదొడుకులు మొదలైనవి ఎదురైనప్పుడు, ఇలాంటి వక్రం ఏర్పడుతుంది. ¤ దక్షతలో స్థిరత్వం ఉండదు. దక్షత ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది. | |
లాక్షిణిక వక్రరేఖ సాధారణంగా అభ్యసనం ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని ప్రతిబింబించేదే లాక్షిణిక అభ్యసన వక్రరేఖ. ఒక లాక్షిణిక అభ్యసన రేఖలో కింది అంశాలుంటాయి. 1. ప్రారంభ స్ఫూర్తి 2. చాంచల్య దశ |
3. పీఠభూమి దశ
4. పీఠభూమి తరువాత స్ఫూర్తి
5. శారీరక ధర్మ హద్దు
ప్రారంభ స్ఫూర్తి : 4. పీఠభూమి తరువాత స్ఫూర్తి
5. శారీరక ధర్మ హద్దు
తొలి ప్రేరణ, నేర్చుకుంటున్నామనే ఆసక్తి వల్ల తొలిదశలో అభ్యసన వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. దక్షత కూడా ఎక్కువగానే ఉంటుంది.
చాంచల్య దశ :
అభ్యసన పరిసరాలకు అనుగుణ్యత పొందడంలో అవరోధాలు, తొలి ప్రేరణ తగ్గడం మొదలైన అంశాల వల్ల అభ్యసన వేగంలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ దశలో మిశ్రమ వక్రరేఖ కనిపిస్తుంది.
పీఠభూమి దశ :
అభ్యసన ప్రక్రియలో కీలక దశ. అభ్యసనం జరుగుతున్న భావన కనిపించదు. దక్షత స్తంభిస్తుంది (స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది.) అభ్యసన వేగంలో పెరుగుదల/ తగ్గుదల కనిపించదు. ఈ దశలో అభ్యాసిని (అవాంతరాలు తొలగించి) తిరిగి అభ్యసన ప్రక్రియలోకి చేర్చకపోతే ఆ ప్రక్రియ నుంచి బయటపడే ప్రమాదం ఉంటుంది. పీఠభూమి దశ నుంచి అభ్యాసి త్వరగా బయటపడేందుకు ఈ మెళకువలను పాటించాలి.
¤ ప్రేరణ కలిగించడం
¤ అభ్యసన పద్ధతులు, ప్రక్రియలను సమీక్షించడం
¤ పునర్బలనాన్ని అందించడం
¤ అభ్యసన మార్గంలో అంతరాలు ఉంటే తొలగించడం
¤ తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వడం
పీఠభూమి తరువాత స్ఫూర్తి :
పీఠభూమి దశలోని అంతరాలు తొలగడంతో రెండోసారి అభ్యాసి స్ఫూర్తిని పొందుతాడు.
శారీరక ధర్మ హద్దు :
వ్యక్తి, శారీరక/ మానసిక సామర్థ్యాలను బట్టి గరిష్ఠ స్థాయిలో అభ్యసనం చేస్తాడు. అంతకుమించి ఎంత ప్రయత్నించినా మెరుగుపరచుకోలేడు. శారీరక ధర్మ హద్దు అనేది వైయక్తిక భేదాలపై ఆధారపడి ఉంటుంది.
¤ శారీరక ధర్మహద్దును పరిగణించడంవల్లే ప్రతిరోజు ఆఖరి పీరియడ్‌లో క్రీడలు నిర్వహిస్తారు.
No comments:
Post a Comment