విలీన విద్య
¤ సామాన్య విద్యార్థుల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉండేవారిని ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు అంటారు. ¤ టెర్మన్-మెరిల్ ప్రజ్ఞా విభాజనం ప్రకారం సాధారణ ప్రజ్ఞ కంటే ఎక్కువ లేదా తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్నవారిని ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలుగా గుర్తించవచ్చు.
¤ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 - 14 వయసు ఉన్న పిల్లలందరికీ సార్వతిక, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి.
¤ అందరికీ విద్య (Education for all - EFA) అంటే ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను కూడా విద్యను అందించాల్సిన వర్గంగా గుర్తించాలి.
¤ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్లో శారీరక, మానసిక వైకల్యాలున్నప్పటికీ వారిని చులకన చేయకూడదు. న్యూనత పోగొట్టాలి. వారిలోని నైపుణ్యాలను వెలికి తీసేదిగా ప్రత్యేక విద్య ఉండాలి.
¤ ప్రత్యేక విద్యను కేవలం మానవత్వ పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించాలని కొఠారీ కమిషన్ సూచించింది.
¤ పత్యేక అవసరాలు ఉన్న పిల్లల విద్యావసరాలు తీర్చడం - మూర్తిమత్వ వికాసం - సాంఘికీకరణ - పునరావాసం కల్పించడానికి దోహదపడే కారకాలను వెలికి తీసే శాస్త్రమే 'ప్రత్యేక విద్య'. వీటినే ప్రత్యేక విద్య లక్ష్యాలుగా కూడా గుర్తించాలి.
¤ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు తగిన పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకన విధానాలు, ఉపాధ్యాయ శిక్షణలు ఉండటం అవసరం.
¤ డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు 12 వర్గాలుగా ఉంటారు.
1. ప్రతిభావంతులు 2. బోధించగల బుద్ధిమాంద్యత ఉన్నవారు
3. తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమాంద్యత ఉన్నవారు 4. మానసిక సమయోజనం లోపించినవారు
5. భావోద్రేకం లోపించినవారు 6. భాషణలోపం ఉన్నవారు
7. బధిరులు 8. కొద్దిపాటి వినికిడి లోపం ఉన్నవారు
9. దృష్టిలోపం ఉన్నవారు 10. కొద్దిపాటి దృష్టిలోపం ఉన్నవారు
11. అంగ వికలురు 12. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు.
¤ ఒకటికంటే ఎక్కువ వైకల్యాలున్నవారిని బహుళ వైకల్యాలున్న పిల్లలు అంటారు. ఉదా: బుద్ధి మాంద్యుల్లో అంగవైకల్యం.
¤ బుద్ధిమాంద్యుల విద్యా ప్రణాళికను ప్రతిపాదించింది శామ్యూల్ కిర్క్, జాన్సన్.
¤ ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చైల్డ్ గ్రంథంలో శామ్యూల్ కిర్క్ స్వావలంబన పొందడాన్ని విద్యా ప్రణాళిక ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు.
¤ అమెరికన్ అసోసియేషన్ ఫర్ మెంటల్ డెఫిషియన్సీ ప్రకారం బుద్ధిమాంద్యత నాలుగు రకాలు.
1. స్వల్పబుద్ధి మాంద్యత (5267 ఐ.క్యు.),
2. కొద్దిపాటి బుద్ధిమాంద్యత (3651 ఐ.క్యు.),
3. తీవ్రమైన బుద్ధిమాంద్యత (2535 ఐ.క్యు.),
4. అత్యధిక బుద్ధిమాంద్యత (19 కంటే తక్కువ).
విద్యాప్రణాళిక పిల్లలు తమపనులు తామే చేసుకోవడానికి, సంఘజీవనానికి, ఆమోదయోగ్యమైన ప్రవర్తన నేర్పడానికి వీలైనదిగా ఉండాలి.
బోధనోపకరణాలు ఆకర్షణీయంగా, సొంతంగా ఉపయోగించుకోగలిగినవిగా, బదలాయింపునకు వీలైనవిగా, బహుముఖ సౌలభ్యంగా, చౌకగా దొరికేవిగా ఉండాలి.
వినడం, జతపరచడం, గుర్తించడం, వస్తువులను కనుక్కోవడం, బొమ్మలు గీయడం, గణిత ప్రశ్నలు మొదలైన అభ్యసన కృత్యాలుండాలి. వీటితోపాటు పదాల కూర్పు, కథా సన్నివేశాల అవగాహన అంశాల్లోకూడా కృత్యాలు చేయించాలి.
¤ మానసిక వికలాంగులకు పూర్వ ప్రాథమిక స్థాయి (3-6 సంవత్సరాలు), ప్రాథమిక స్థాయి (6-9 సంవత్సరాలు)లలో శిక్షణ ఇవ్వవచ్చు.
¤ 2 నుంచి 3 సంవత్సరాల కాలంపాటు ఇచ్చే పూర్వ ప్రాథమిక స్థాయి శిక్షణలో సొంత విషయాలు సమష్టి లక్ష్యాలు, క్రియాత్మక పదాలు, సరళభావనలు, చదవడం, రాయడం, అంకెలు వేయడం అంశాలుగా ఉంటాయి.
¤ మానసిక వికలాంగుల ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యా బోధనలోని ప్రణాళికాంశాలుగా స్వీయ సంరక్షణ, భాషా నైపుణ్యం, సామాజిక నైపుణ్యం విద్యాంశాలు, పూర్వ వృత్తి విద్య నైపుణ్యాలు ఉంటాయి.
¤ శిక్షణ పొందగలిగిన మానసిక వికలాంగ (టిఎంఆర్) పిల్లల ప్రజ్ఞా లబ్ధి వెస్లర్ స్కేలులో 40-50 వరకు, బినే స్కేలులో 36-51 వరకు ఉంటుంది.
¤ టిఎమ్ఆర్ పిల్లల విద్యాసాధన సాధారణ పిల్లలతో పోల్చితే 1/3 వంతు ఉంటుంది. గరిష్ఠంగా 4వ తరగతి వరకు చదవగలరు.
¤ బుద్ధిమాంద్యుల మానసిక వికాసానికి నిర్ణయించిన వాటిని ప్రమేయ కార్యక్రమాలంటారు.
¤ ప్రమేయ కార్యక్రమంలో అంచనా, ప్రణాళికా పథకం, చికిత్సాంశాలు, వ్యక్తిగత విద్యాంశాలు కార్య విశ్లేషణ అనే సోపానాలు ఉంటాయి.
¤ బోధించాల్సిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి క్రమపద్ధతిలో బోధించడాన్ని కార్య విశ్లేషణ అంటారు.
¤ బుద్ధిమాంద్యులు కొత్త పనులు నేర్చుకోవడానికి, నేర్చుకున్న పనులు సాధన చేయడానికి ఇచ్చే ప్రోత్సాహ కాలను పునర్చలనాలు అంటారు.
¤ పునర్భలనాలు మూడు రకాలు 1. ప్రాథమిక (ఆహారం, నిద్ర)
2. గౌణ (మార్కులు, గ్రేడులు)
3. సాంఘిక (పొగడ్త, కౌగిలింత).
¤ బుద్ధిమాంద్యులకు తగినది ప్రాథమిక పునర్భలనం.
¤ పునర్భలన పద్ధతులు - ఆకృతీకరణ, గొలుసు విధానం, ప్రేరణ, సంకేతీకరణ, క్రమేణ అస్తిత్వం పరిసర మార్పు, అనుకరణ, సాధారణీకరణ, విచక్షణ.
¤ బుద్ధిమాంద్యుల విద్యా సదుపాయాలు - సమైక్య విధానం, ప్రత్యేక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సంచార పాఠశాలలు, గృహశిక్షణ.
¤ అభ్యసన ప్రక్రియ, అవధాన ప్రవర్తనలో సమస్య లున్నవారిని అభ్యసన లోపాలున్న పిల్లలు అంటారు.
¤ అభ్యసన వైకల్యాలు, అనుభవాలను మొదటిసారిగా ఉపయోగించింది - శామ్యూల్‌కిర్క్.
¤ కేంద్రనాడీ వ్యవస్థలో దుష్కరణ వల్ల విలంబిత వికాసం (నెమ్మదిగా అభివృద్ధి చెందడం) ఉన్న వారిని అభ్యసన వైకల్యం ఉన్న పిల్లలుగా గుర్తించాలి.
¤ అభ్యసన వైకల్యానికి కారణాలు 1. ఆంగిక కారణాలు (కనిష్ఠ మస్తిష్క దుష్కరణ ఎంబిడి)
2. జన్యుపరమైన కారణాలు (అతిక్రియాశీలత, టర్నర్స్ సిండ్రోమ్),
3. పరిసర కారణాలు (ప్రిమెచ్యూర్‌బర్త్).
¤ డొమైన్ - డిలాకోలు సిద్ధాంతం నాడీ వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందే క్రియాత్మక నైపుణ్యాలు - కదలిక, భాష, చేతి సామర్థ్యం, దృష్టి సామర్థ్యం, వినికిడి సామర్థ్యం స్పర్శా సామర్థ్యం.
¤ అభ్యసన వైకల్యాలు భాష, పఠన, లేఖన, గణిత అంశాల్లో వ్యక్తమవుతుంటాయి.
¤ శ్రవణవచోఘాతం ఉన్నవారిలో భాషణ వైకల్యాలు వస్తాయి.
¤ విజువలైజేషన్, స్పెల్లింగ్ సమస్యలు, వాక్య నిర్మాణ అస్తవ్యస్తాలను లేఖన వైకాల్యాలుగా పరిగణిస్తారు.
¤ ఉపాధ్యాయుడికి దగ్గరగా పిల్లలను కూర్చోబెట్టాలి. సంక్షిప్తీకరణ, పునశ్చరణ, క్రియావిశ్లేషణ పద్ధతుల ద్వారా వీరికి బోధించాలి.
ప్రతిభావంతులు: వీరి ప్రజ్ఞా సూచిక 120 -140 వరకు ఉంటుంది. సమాజంలో వీరి పరిమాణం 2-5%.
¤ వీరు సమాజ అభివృద్ధికి తమ విశేష కౌశలాలను ఉపయోగిస్తారని బెంట్లీ అభిప్రాయపడ్డాడు.
¤ అత్యున్నత నాణ్యత ఉన్న కార్యకలాపాలను నిర్వ హిస్తారని కరోల్, మార్టన్స్ తెలిపారు.
¤ మార్‌లాండ్ ప్రకారం వీరిలో ఉన్నత స్థాయి నిష్పాదనా సామర్థ్యం ఉంటుంది.
¤ త్వరితగతిలో (డబుల్ ప్రమోషన్) వేర్పాటు (ప్రత్యేక పాఠశాలలు) సంవృద్ధి చేయడం (సాధారణ తరగతిలోనే అదనపు అభ్యసనానుభవాలు కల్పించడం) ద్వారా విద్యా సౌకర్యాలు అందించవచ్చు.
దృష్టిలోపం: దృష్టి స్పష్టత 20/200, దృష్టి క్షేత్ర కోణం (విజువల్ యాంగిల్) 200/1800 ఉన్నవారిని దృష్టిలోపం ఉన్నవారు అంటారు.
¤ స్నెలెన్స్ చార్ట్ ద్వారా దృష్టి స్పష్టతను కొలుస్తారు. కీస్టోన్ టెలీ బైనాక్యులర్ పద్ధతి, ఆర్థోలేటరల్ పద్ధతి ద్వారా దృష్టి లోపాలను నిర్ధారిస్తారు.
¤ కరోల్ ప్రకారం వ్యక్తిపై అంధత్వం చూపే ప్రభా వాలను ఆబ్బెక్టివ్ కారణాలుగాను, అంధత్వం ఉన్న వ్యక్తిపై ఇతరులు చూపే ప్రభావాలను సబ్బెక్టివ్ కారణాలుగాను వర్గీకరిస్తారు.
¤ లివింగ్స్టన్ ప్రకారం పాక్షిక దృష్టిలోపం ఉన్న పిల్లల ఐ.క్యు. 98.6.
¤ వీరి విద్యా సౌకర్యాల్లో వనరుల గది, సంచార ఉపాధ్యాయుల సేవలు ముఖ్యమైనవి. వనరుల గదిలో ఆకుపచ్చ రాత బల్లలు, పెద్ద పరిమాణ ఉపకరణాలు, బ్త్లెండ్ ఫోల్డర్, ట్రైల్ ఫ్రేం, థర్మోఫాం మెషీన్స్ టాకింగ్ బుక్స్, బ్రెయిలీ లిపి చదరాలు ఉంటాయి.
శ్రవణ లోపం: భాషాభివృద్ధికి అవరోధంగా నిలిచే వినికడి లోపం ఉన్న వారిని బదిరులు అంటారు.
¤ మైకేల్ బస్ట్ ప్రకారం వంశపారంపర్య (ఎక్సోజీనస్), వంశపారంపర్యంకాని (ఎండోజీనస్) కారణాల వల్ల శ్రవణ లోపం ఏర్పడుతుంది.
¤ వైద్యపరంగా సెన్సరీ న్యూరల్, కండక్టివ్, సెంట్రల్ డెఫ్నెస్ రకాలుంటాయి.
¤ 16-20 డెసిబుల్స్ స్థాయిని న్యూనతయంగా, 75 డిబి పైన అతి తీవ్రమైందిగా గుర్తిస్తారు.
¤ వినికిడి లోపం వల్ల భాషణ లోపం వస్తుంది. ఉచ్ఛారణ, స్వర, లయ దోషాలు కనిపిస్తాయి.
¤ బోనెట్, పెరేరి ప్రకారం ఓష్ఠ్య పఠనం (lip reading) ప్రధానమైంది. ఎక్కువగా మాట్లాడించడం, పదాలు, సంభాషణలు పలికించడం, చిన్న పుస్తకాలు చదివించడం, అనుక్రమ ఆటలు వీరికి అందించదగిన విద్యా సౌకర్యాల్లో ముఖ్యమైనవి.
చలన వైకల్యం: చలనావయవాల్లో (కాళ్లు, చేతులు) కలిగే వైకల్యం. ఇది పుట్టుకతో అంటువ్యాధులు, కేంద్ర నాడీమండల పక్షవాతం (సెరిబ్రల్ పాల్సి), ప్రమాదాల వల్ల వస్తుంది.
¤ పర్సన్ విత్ డిస్ ఎబిలిటీ యాక్ట్ (1995) ప్రకారం ఇది చలనావయవాల్లో కలిగే గణనీయమైన పరిమితి.
¤ నాడీమండల పక్షవాతం వల్ల ఎథిటోసిస్, అటాక్సియా, స్పాస్టిసిటి, రెజిడిటి లాంటి అపసవ్యతలు వస్తాయని ఫే పేర్కొన్నాడు.
¤ చలన వైకల్యం ఉన్న పిల్లల్లో దృష్టి, శ్రవణ దోషాలుంటాయని కార్ట్‌వెల్, మానసిక లోపాలుంటాయని హామస్, న్యూనత ఉంటుందని క్రూక్‌షాంక్ అభిప్రాయపడ్డారు.
¤ వీరిలో ప్రజ్ఞా వికాసం మామూలుగానే ఉంటుంది (మెక్కీ). స్కూల్ ఫర్ క్రిపిల్డ్ (అంగ వికలురకు) స్కూల్ ఫర్ హ్యాండికాప్డ్ (వికలాంగులకు) ద్వారా విద్యా వసతులు కల్పిస్తారు.
విలీన విద్య: ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సాధారణ పాఠశాల్లో ప్రత్యేక విద్యను అందించే కార్యక్రమం.
¤ ప్రతి విద్యార్థిని ప్రత్యేక వ్యక్తిగా భావించడం. ప్రాథమిక బోధనా క్రియలు ఉపయోగించడం, అభ్యసనలో కష్టానుభవాన్ని సాధారణమైందిగా గుర్తించడం. అభ్యసనలో పరిణామానికి సమయం పడుతుందని గుర్తించడం అవసరం.
¤ ఒక విద్యార్థి, మరొక విద్యార్థికి మధ్య అభ్యసన సాధనం విలీన విద్య. సహకార అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. సాధారణ తరగతి గదిని వ్యక్తిగత అభ్యసన అవసరాలకు స్పందించేట్లు చేస్తుంది.
No comments:
Post a Comment