భాషా చతుష్కయాలు' |
భాషా నైపుణ్యాలు నాలుగింటిలో మూడవ, నాల్గవ సోపానాలు పఠనం, లేఖనం. సంపూర్ణత, సమగ్రత అనేది భాషా నైపుణ్యాల వల్లే సాధ్యమవుతుంది. ఈ నాలుగు భాషా నైపుణ్యాలను 'భాషా చతుష్కయాలు' అనికూడా అంటారు.
పఠనం |
పఠనం అనే భాషా నైపుణ్యానికి శ్రవణం తోడ్పడుతుంది. లేఖనం పఠనంపై ఆధారపడి ఉంటుంది. చదువరి విజ్జానవంతుడు అవుతాడు. అందుకే కందుకూరి వీరేశలింగం ''చినిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో'' అన్నాడు. ప్రాచీనులు 'పుస్తకం హస్తభూషణం' అన్నారు. అంటే పుస్తకం చేతిలో ఉంటే సంస్కారిగా, విద్యావేత్తగా భావిస్తారని అర్థం. పఠనశక్తిని పెంపొందించుకుంటే భాషణ నైపుణ్యం అలవడుతుంది. వక్తృత్వ నైపుణ్యానికి పఠనం తోడ్పడుతుంది.
పఠనం అంటే చదవడం అని మాత్రమే కాదు. లిఖితరూప పదాలను చూసి వాగింద్రియాల సహాయంతో ఉచ్చరించి, భావాన్ని గ్రహించడాన్ని 'పఠనం' అంటారు. ఉత్తమ గ్రంథ పఠనం మనిషి మూర్తిమత్వానికి సహకరిస్తుంది. జ్ఞాన సంపద విస్తరించాలంటే పఠనం తప్పదు. వెనుకటి తరం మనీషుల ఆలోచనలను భద్రపరిచేది పుస్తకం. అందువల్ల లోకజ్ఞానం అలవడాలంటే పుస్తక పఠనం అవశ్యం. లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోకజ్ఞానం పొందడానికి 'పఠనం' అంత అవసరమని గ్రహించాలి. ముందుగా ఉపాధ్యాయులకు నిత్యవిద్యార్థిగా పఠనశక్తి ఉండాలి. లేకపోతే వారికి సమకాలీన స్పృహ ఉండదు.
పఠనం - ఉద్దేశాలు (లేదా ప్రయోజనాలు):పఠనం అంటే చదవడం అని మాత్రమే కాదు. లిఖితరూప పదాలను చూసి వాగింద్రియాల సహాయంతో ఉచ్చరించి, భావాన్ని గ్రహించడాన్ని 'పఠనం' అంటారు. ఉత్తమ గ్రంథ పఠనం మనిషి మూర్తిమత్వానికి సహకరిస్తుంది. జ్ఞాన సంపద విస్తరించాలంటే పఠనం తప్పదు. వెనుకటి తరం మనీషుల ఆలోచనలను భద్రపరిచేది పుస్తకం. అందువల్ల లోకజ్ఞానం అలవడాలంటే పుస్తక పఠనం అవశ్యం. లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోకజ్ఞానం పొందడానికి 'పఠనం' అంత అవసరమని గ్రహించాలి. ముందుగా ఉపాధ్యాయులకు నిత్యవిద్యార్థిగా పఠనశక్తి ఉండాలి. లేకపోతే వారికి సమకాలీన స్పృహ ఉండదు.
1. స్పష్టంగా మాట్లాడేలా చేయడం.
2. నిర్దుష్టంగా, నిర్దిష్టంగా మాట్లాడేలా చేయడం.
3. ఊనిక, స్వర భేదం పాటిస్తూ చదవడం.
(ఊనిక అంటే నొక్కి పలకడం. స్వరభేదం - వాచికంలో ఉన్న స్వరభేదం)
4. సమస్వర స్థాయిలో చదవడం.
5. భావానుగుణంగా, వాచికాభినయంగా చదవడం.
6. సముచిత వేగంతో పఠించడం.
(మరీ నెమ్మదిగాను, మరీ వేగంగాను కాకుండా)
7. రసానుభూతి కలిగేలా - కలిగించేలా చదవడం.
8. స్వీయశైలిలో చదివే అలవాటు చేయడం.
9. మౌన పఠనాభిరుచిని పెంపొందించడం.
10. వివిధ రచనాశైలులను పరిచయం చేసుకుంటూ చదవడం.
(నన్నయశైలి - కథాకథనశైలి. తిక్కనది నాటకీయశైలి. ఎఱ్ఱనది వర్ణనాత్మక శైలి. గురజాడది వ్యావహారిక భాషాశైలి)
11. సత్యాన్వేషణ, పరిశోధనాసక్తిని కలిగించడం.
12. ఉచ్చారణా నైపుణ్యాన్ని కలిగించడం.
13. విషయ జ్ఞానాన్ని పెంపొందింపజేయడం.
14. ఆనందాన్ని, అనుభూతిని ఇవ్వడం.
15. క్షుణ్ణ పఠనానికి సంసిద్ధుడిని చేయడం.
పఠన బోధన పద్ధతులు
పఠనబోధనకు చాలా పద్ధతులున్నాయి. విద్యార్థుల స్థాయిని, పాఠ్యాంశాన్ని బట్టి పద్ధతిని పాటించవచ్చు.
అక్షర పద్ధతి: పిల్లలతో చదివింపజేస్తూ అక్షరాలను దిద్దించే పద్ధతి. ఇది అనూచానంగా వస్తున్న ప్రాచీన పద్ధతి. ముందు అక్షరాలను చదివిస్తూ దిద్దిస్తారు. ఆ తర్వాత గుణింతాలు, తర్వాత పదాలను చదివింపజేస్తూ రాయడం నేర్పుతారు. దీనివల్ల విద్యార్థులుగుణింతాల వల్ల అక్షరాలు, అక్షరాల కూడిక వల్ల పదాలు, పదాల కూడిక వల్ల వాక్యాలు ఏర్పడతాయని తెలుసుకుంటారు. ధ్వనులను, వాటి చిహ్నాలను, ఉచ్చారణనూ స్పష్టంగా నేర్చుకుంటారు. లిపిగతజ్ఞానంతో పఠనం అలవడుతుంది. అయితే ఈ పద్ధతి మనోవైజ్ఞానిక శాస్త్రం ప్రకారం వాంఛనీయం కాదు. బాలుర చేతివేళ్లకు అంత పటుత్వం లేకపోవడం, అక్షరాలు గుణింతాలు అర్థరహితాలు కావడం దీనికి కారణాలు. యాంత్రికంగా దిద్దడం వల్ల విసుగు పుడుతుంది. ఉపాధ్యాయులకు, పెద్దలకు భయపడి మాత్రమే దిద్దుతారు.
పద పద్ధతి: అక్షరాల వల్ల పదాలు ఏర్పడతాయి. భాషకు పదాలే ప్రాతిపదిక. పదాలు అర్థవంతాలు కూడా. ముందుగా అక్షర సామ్యం ఉన్న పదాలను బొమ్మల ద్వారా గుర్తింపజేసి చదివిస్తారు.
ఉదా: అమ్మ - అన్న - అక్క - ఆవు- ఆకు - ఇల్లు - ఈగ - ఈల లాంటి పదాలతో పఠనం ప్రారంభించడం ఆసక్తి కరంగా ఉంటుంది. కాబట్టి విసుగు ఉండదు. పదాలతో పరిచయం ఏర్పడిన తర్వాత వాక్యాలు చదవడం నేర్పాలి. అక్షర పద్ధతి కంటే ఇది మేలైంది. భాషకు మూలం వాక్యమైతే, వాక్యానికి మూలం పదాలు. పదాలకు మూలం అక్షరాలు. ఒకటో తరగతి తెలుగు వాచకాన్ని పద పద్ధతిని అనుసరించి రూపొందించారు.
వాక్య పద్ధతి: చిత్రపటాల సహాయంతో వాక్య పఠనం నేర్పాలి. బాలుడు బంతితో ఆడుతున్న చిత్రం ద్వారా 'బాలుడు ఏమి చేస్తున్నాడు?' అని ప్రశ్నించి 'బాలుడు బంతి ఆడుతున్నాడు' అనే వాక్యం రాబట్టాలి. 'సింహం - కుందేలు' కథను చిత్రపటాల ద్వారా చెప్పించవచ్చు. ఆధునిక విద్యావేత్తల ప్రకారం పఠనానికి వాక్య పద్ధతి ప్రశస్తమైంది.
కథా పద్ధతి: ఏడెనిమిది వాక్యాలతో పూర్తయ్యే కథలనే చెప్పించాలి. చిత్రాలను చూపించి కథలను చెప్పించవచ్చు. కేవలం వాక్యాలనే చూసి చదివేట్లు చేయడాన్ని చూసిచెప్పే పద్ధతి అంటారు. కథాకథన పద్ధతి భాష నైపుణ్యాన్ని, కథాపద్ధతి పఠన నైపుణ్యాన్ని అభివృద్ధి పరుస్తాయని గ్రహించాలి. పఠన బోధన పద్ధతులు లేదా పఠన భేదాలు ముఖ్యంగా నాలుగు రకాలు.
1. ప్రకాశ పఠనం 2. మౌన పఠనం 3. క్షుణ్ణ పఠనం 4. విస్తార పఠనం.
అసలు పఠనం అంటే లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని చదవడం. ప్రకాశ పఠనం అంటే ఇతరులకు వినిపించేలా హెచ్చు స్వరంతో చదవడం. దీన్నే బాహ్య పఠనం, బాహిర పఠనం అనికూడా అంటారు. తొలిదశలో ఉపకరించే పఠనం బాహ్య పఠనం. ప్రకాశ పఠనం వల్ల భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలను సవరించవచ్చు. పద్యాలు, పాటలు లయబద్ధంగా చదివి ఆనందానుభూతిని పొందవచ్చు.ఉదా: అమ్మ - అన్న - అక్క - ఆవు- ఆకు - ఇల్లు - ఈగ - ఈల లాంటి పదాలతో పఠనం ప్రారంభించడం ఆసక్తి కరంగా ఉంటుంది. కాబట్టి విసుగు ఉండదు. పదాలతో పరిచయం ఏర్పడిన తర్వాత వాక్యాలు చదవడం నేర్పాలి. అక్షర పద్ధతి కంటే ఇది మేలైంది. భాషకు మూలం వాక్యమైతే, వాక్యానికి మూలం పదాలు. పదాలకు మూలం అక్షరాలు. ఒకటో తరగతి తెలుగు వాచకాన్ని పద పద్ధతిని అనుసరించి రూపొందించారు.
వాక్య పద్ధతి: చిత్రపటాల సహాయంతో వాక్య పఠనం నేర్పాలి. బాలుడు బంతితో ఆడుతున్న చిత్రం ద్వారా 'బాలుడు ఏమి చేస్తున్నాడు?' అని ప్రశ్నించి 'బాలుడు బంతి ఆడుతున్నాడు' అనే వాక్యం రాబట్టాలి. 'సింహం - కుందేలు' కథను చిత్రపటాల ద్వారా చెప్పించవచ్చు. ఆధునిక విద్యావేత్తల ప్రకారం పఠనానికి వాక్య పద్ధతి ప్రశస్తమైంది.
కథా పద్ధతి: ఏడెనిమిది వాక్యాలతో పూర్తయ్యే కథలనే చెప్పించాలి. చిత్రాలను చూపించి కథలను చెప్పించవచ్చు. కేవలం వాక్యాలనే చూసి చదివేట్లు చేయడాన్ని చూసిచెప్పే పద్ధతి అంటారు. కథాకథన పద్ధతి భాష నైపుణ్యాన్ని, కథాపద్ధతి పఠన నైపుణ్యాన్ని అభివృద్ధి పరుస్తాయని గ్రహించాలి. పఠన బోధన పద్ధతులు లేదా పఠన భేదాలు ముఖ్యంగా నాలుగు రకాలు.
1. ప్రకాశ పఠనం 2. మౌన పఠనం 3. క్షుణ్ణ పఠనం 4. విస్తార పఠనం.
పఠన నైపుణ్యం అనేది ప్రక్రియానుగుణంగా ఉంటుంది. పద్యం, గేయం, కథ లాంటివి చదివేటప్పుడు పఠన వైవిధ్యం ఉంటుంది. ప్రకాశ పఠనంలో చూపుమేర ఉంటుంది. దీన్నే నయనమితి లేదా పలుకుమేర అంటారు. ఒక్కచూపులో ఎంతవరకు చూడగలుగుతాడో అది అతడి 'చూపుమేర' అవుతుంది. ఒక్కగుక్కలో (ఆపకుండా) పలికే సముదాయాన్ని 'పలుకుమేర' అంటారు. దీన్నే వాఞ్మతి అనీ అంటారు. పదవిభాగం తెలియకుండా చదవడం, అతి వేగంగా చదవడం, చెవులు బద్దలయ్యేట్లు చదవడం పఠన దోషాలవుతాయి. ఇతరులకు వినిపించకుండా చదవడం కూడా ప్రకాశ పఠన దోషాలే.ప్రాథమిక దశలో ప్రకాశ పఠనం చాలా ఉపకారి. పఠన వేగపోటీలు, శతక పద్యాల పఠనం ప్రాథమిక దశకు అనుకూలం. మాధ్యమిక, ఉన్నత దశలో పద్యాలను, గేయాలను లయబద్ధంగా చదివించాలి. స్వరభేదంతో, వాచికాభినయంతో అభ్యాసం చేయించాలి. కవి సమ్మేళనాల నిర్వహణ, సభా వేదికలపై వ్యాసాల పఠనం ఉన్నత దశకు మిక్కిలి అనుకూలం. ప్రకాశ పఠనం ప్రయోజనకారి అయినా కొన్ని పరిమితులున్నాయి. వాగింద్రియాలకు శ్రమ కలుగుతుంది. ఎక్కువసేపు చదవలేడు. ఇతరులకు ఆటంకం కలుగుతుంది. గ్రంథాలయాల్లో అనుకూలం కాదు.
వాగింద్రియాలకు శ్రమలేకుండా కంటితో చూసి మనసుతో చదివేది మౌనపఠనం. మాధ్యమిక, ఉన్నత దశలకే మిక్కిలి అనుకూలం. చూపుమేరకు పరిమితి లేదు. కాబట్టి గ్రంథాలయాలకు మౌనపఠనం మిక్కిలి వాంఛనీయం.
ప్రాథమిక దశలో మౌన పఠనాన్ని క్రీడా పద్ధతిలో ప్రారంభించవచ్చు. అట్టల మీద పెద్ద అక్షరాలతో రాసి చూపించవచ్చు. చిన్నచిన్న పేరాలను మౌన పఠనానికి అభ్యాసాలుగా ఇవ్వాలి. బహుగ్రంథ పఠనం జ్ఞాన సంపాదనకు తోడ్పడుతుంది. బహుగ్రంథ పఠనం మౌనపఠనం వల్లే సాధ్యం. అయితే మౌన పఠనం వల్ల ఉచ్చారణ దోషాలను సవరించుకోలేరు. ఆనందానుభూతి పొందడం కష్టం. మనసు అన్యాక్రాంతం అవడంతో విషయం ఒంటబట్టదు.
క్షుణ్ణ పఠనం అంటే గద్య, పద్యాలను ప్రతిపదార్థ తాత్పర్యాదులతో పరిపూర్ణంగా తెలుసుకుంటూ చదవడం. పద్యబోధనలో క్షుణ్ణ పఠనమే చాలా ముఖ్యం. సాహిత్యాభిరుచి, వృత్తులు, పాకాలు, రసం, ఛందస్సు, వ్యాకరణాంశాలను క్షుణ్ణ పఠనం వల్లే విద్యార్థి గ్రహించగలడు. భాషపై అధికారం ఏర్పడుతుంది. లోతైన పరిశీలనకు అవకాశం కలుగుతుంది. పఠన భేదాల్లో చివరిది విస్తార పఠనం. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడమే విస్తార పఠనం. వాచకేతర పుస్తకాలను విస్తారంగా చదవడానికి ఈ పఠన పద్ధతి తోడ్పడుతుంది. ఉపవాచకాలు, గ్రంథాలయాల్లోని పుస్తకాలు విస్తార పఠనానికి ఉపకరిస్తాయి. విద్యార్థులు స్వయంకృషితో జ్ఞానార్జన చేస్తారు. విరామ సమయం సద్వినియోగం అవుతుంది.
లేఖనం: ఇది భాషా నైపుణ్యాల్లో చివరిది. కష్టతరమైంది కూడా. ఇది లిపి రూపమైన భావ ప్రకటన సాధనం. వాగ్రూపానికి స్థిర రూపమే లేఖనం. తరతరాల జ్ఞానాన్ని భావితరాలకు అందించడానికి లేఖనం అవసరం.
ప్రయోజనాలు:
¤ స్పష్టంగా, నిర్దుష్టంగా రాసే అలవాటు చేయడం.
¤ భావదోషాలు లేకుండా, విరామ చిహ్నాలను పాటిస్తూ రాయించడం.
¤ సమతను పాటిస్తూ అందంగా రాసే అలవాటును పెంపొందించడం.
¤ విషయాన్ని విపులీకరణంగా, సంక్షిప్తీకరణంగా రాసేలా చేయడం.
¤ సృజనాత్మక రచనను పెంపొందింపజేయడం.
¤ జాతీయాలను, సామెతలను, లోకోక్తులను అవసరానుగుణంగా ఉపయోగిస్తూ రచనలు చేయడం.
¤ స్వీయ శైలి కలిగించడం.
¤ అనువాద రచనా సామర్థ్యాన్ని పెంపొందించడం.
¤ విద్యార్థులను ఉత్తమ రచయితలుగా మలచడం.
¤ పఠనాసక్తి ఉంటేనే లేఖన నైపుణ్యం అలవడుతుంది. కాబట్టి పరోక్షంగా పఠన నైపుణ్యం పెరుగుతుంది.
¤ శబ్ద స్వరూపాన్ని లేఖనం ద్వారా బాగా గ్రహించవచ్చు.
పూర్వం అక్షరాలను దిద్దించడంతో లేఖన బోధనా పద్ధతి మొదలయ్యేది. ఇది సాంప్రదాయిక పద్ధతి. అయిదు సంవత్సరాల వయసు నుంచే అక్షరాలను, గుణింతాలను దిద్దించడం ద్వారా లేఖనంతో విద్యాభ్యాసం ప్రారంభించేవారు. ఆధునిక విద్యావేత్తల ప్రకారం ఇది అసమంజసం. శ్రవణ, భాషణ, పఠనాల తర్వాతనే లేఖనాన్ని నేర్పాలనేది నేటి అభిప్రాయం. అక్షరాలు నేర్చుకోవడానికే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ సాంప్రదాయిక పద్ధతి ఉపయుక్తం కాదని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం.
ఆధునిక పద్ధతి ప్రకారం పఠనం నేర్పించడం మొదలుపెట్టిన రెండు మూడు నెలల తర్వాత లేఖనం నేర్పాలి. ముందు నిలువు గీతలు, అడ్డ గీతలు, అర్ధచంద్రాకార గీతలు, వృత్తాలు, నల్లబల్లపై రాసి పిల్లలు పలకలపై రాసేట్లు చూడాలి. తెలుగు లిపి గుండ్రవత్తు ఉన్నది. తినుబండారాలు, ఆటవస్తువులు మొదలైన వాటికి సంబంధించిన పదాలనే మొదట రాయించాలి. లేఖనం వల్ల మంచి దస్తూరి అలవడాలి. గుండ్రంగా, విడివిడిగా, ఒద్దికగా సమానమైన పంక్తులతో ముత్యాలకోవలాగా రాస్తే అది అందమైన లేఖనం. స్పష్టత, సమత, వేగం, రీతి, భంగిమ అనేవి ముఖ్యమైన లేఖన లక్షణాలు. బలపం, పెన్సిలు, కలం, సుద్దముక్క లేఖనోపకరణాలు. ప్రాథమిక, మాధ్యమిక దశలో లేఖనం అలవడకపోతే జీవితంలో బాధపడాల్సిన సమయాలు ఎదురవుతాయి.
లేఖనంలో ఒత్తులు సరిగా ఉంచకపోవటం, శబ్ద స్వరూపం తెలియక తప్పులు రాయడం, అక్షర భేదం తెలియకుండా రాయడం, విరామ చిహ్నాలను సరిగా పాటించక పోవడం ... ఇవన్నీ లేఖన దోషాలు. ఈ దోషాలు రాకుండా రాయడానికి కొన్ని కృత్యాలు చేపట్టాలి.ఆధునిక పద్ధతి ప్రకారం పఠనం నేర్పించడం మొదలుపెట్టిన రెండు మూడు నెలల తర్వాత లేఖనం నేర్పాలి. ముందు నిలువు గీతలు, అడ్డ గీతలు, అర్ధచంద్రాకార గీతలు, వృత్తాలు, నల్లబల్లపై రాసి పిల్లలు పలకలపై రాసేట్లు చూడాలి. తెలుగు లిపి గుండ్రవత్తు ఉన్నది. తినుబండారాలు, ఆటవస్తువులు మొదలైన వాటికి సంబంధించిన పదాలనే మొదట రాయించాలి. లేఖనం వల్ల మంచి దస్తూరి అలవడాలి. గుండ్రంగా, విడివిడిగా, ఒద్దికగా సమానమైన పంక్తులతో ముత్యాలకోవలాగా రాస్తే అది అందమైన లేఖనం. స్పష్టత, సమత, వేగం, రీతి, భంగిమ అనేవి ముఖ్యమైన లేఖన లక్షణాలు. బలపం, పెన్సిలు, కలం, సుద్దముక్క లేఖనోపకరణాలు. ప్రాథమిక, మాధ్యమిక దశలో లేఖనం అలవడకపోతే జీవితంలో బాధపడాల్సిన సమయాలు ఎదురవుతాయి.
అవి...
దృష్ట లేఖనం: అంటే చూసిరాత. రాసిన లేదా అచ్చు అయిన అంశాన్ని విద్యార్థి చూసి, తనలో తాను చదువుకుంటూ రాయడం దృష్ట లేఖనం.
ఒరవడి: దీన్నే కాపీ అంటారు. మొదటి పంక్తి అందంగా ఉంటే దాన్ని చూసి కింది పంక్తుల్లో అలాగే రాయడానికి ప్రయత్నించడమే కాపీ పద్ధతి. సామాన్యంగా మొదటి పంక్తి సూక్తిగానీ, సామెతగానీ అయి ఉంటుంది. దీన్ని మాదిరి పంక్తి అంటారు. తెలంగాణలో దీన్ని 'కరడాలు' రాయడం అంటారు. అయితే ఈ ఒరవడిలో ఒకలోపం ఉందంటారు. మాదిరి పంక్తిని చూసి రాసిన తర్వాత విద్యార్థి మళ్లీ మాదిరి పంక్తి చూడకుండా తను రాసిన పంక్తినే చూసి రాస్తాడు. దీనివల్ల దస్తూరి రాదంటారు. కాబట్టి కాపీ పుస్తకంలో పై నుంచి కిందకు కాకుండా, కింద నుంచి పైకి రాయించమంటారు.
ఉక్త లేఖనం: ఒకరు చెప్పగా విని రాయడం. దీన్నే 'డిక్టేషన్' అంటారు. ఉచ్చారణకు వర్ణక్రమానికి సమన్వయం కుదిర్చి దోష రహితంగా రాయించడమే దీని ఉద్దేశం. ఉక్తలేఖనం పాఠ్యాంశాల నుంచే ఇవ్వాలి. విద్యార్థుల స్థాయిని అనుసరించి పదాలు ఇవ్వాలి. ఉక్త లేఖనం ఉపాధ్యాయుడు రెండు, మూడుసార్లు కంటే ఎక్కువ చెప్పకూడదు. ఉపాధ్యాయుడి ఉచ్చారణ స్పష్టంగా, నిర్దుష్టంగా ఉండాలి.
లేఖనం లేదా రాత అనేది ఆలోచించి రాయనక్కరలేదు. ఆలోచనతో కూడిన లేఖనాన్ని లిఖిత చర్య అంటారు. పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించి రాయించడం, దినచర్య, వ్యాసం రాయించడం, పద్య భాగాన్ని సొంత మాటల్లో రాయమనడం ఇవన్నీ లిఖిత చర్యలే. నల్లబల్లపై రాసింది చూసి రాయడం లేఖనం అవుతుందే తప్ప లిఖిత చర్య కాదని గమనించాలి.
శ్రవణం వల్ల భావగ్రహణశక్తి అలవడుతుంది. భాషణం భావ ప్రకటనకు తోడ్పడుతుంది. పఠనం, లేఖనం కూడా భావ ప్రకటనకే ఉపకరిస్తాయి. అయితే భావ గ్రహణమూ ఉంటుంది. కాబట్టి ఈ నాలుగు భాషా నైపుణ్యాలకు అంతర్గత సంబంధం ఉంది. ఈ భాషా నైపుణ్యాలు అలవడితే జీవితంలో రాణించగలరు.
No comments:
Post a Comment